144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్సై రమేష్ బాబు
జూన్ నాలుగో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు సందర్భంగా అందరూ శాంతియుతంగా ఎలాంటి అమాచినేయ సంఘటనలు జరగకుండా
సామరశ్యంగా ఉండాలని సీఐ తులసిరామ్ తెలిపారు
మండల పల్లెల్లో చేసుకొనే సంబరాలు సహృద్భావ వాతావరణంలో చేసుకోవాలని, ముఖ్యంగా బెట్టింగ్లు జోలికిపోయిజీవితాలు నాశనం చేసుకోవద్దని, గతంలో జరిగిన చిన్నిపాటి ఘటనలు కూడా జరగకుండా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఫలితాలు ఎలా వచ్చినా మనో భావనలను గౌరవిస్తూ శాంతియుతంగా ఉండాలని రాయచోటి సీఐ తులసిరామ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మతసామరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సమస్యలకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని ఆయన గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని మతాల పెద్దలతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నమండెం సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ మండలంలో ప్రజలంతా మంచి సోదరుభావంతో మెలిగేవారని, గతంలో జరిగిన చెడు అనుభవాల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం 20 24 ఫలితాలు ఎటువంటి అవాంఛనీయక సంఘటనలకు తావులేకుండా జరుపుకోవాలని ఆయన అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మండల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అల్లర్లకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారి సీఐ తులసీరామ్. ఎస్సై రమేష్ బాబు తెలిపారు