144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్ కే హుస్సేన్







0a144 సెక్షన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఏ తులసి రామ్ ఎస్ కే హుస్సేన్  


 తిరుణాల ఉత్సవాలు  శాంతియుతంగా  జరుపుకోవాలని  


సామరశ్యంగా ఉత్సవాలు చేసుకోవాలి..


 మండల పల్లెల్లో చేసుకొనే ఉత్సవాలు సహృద్భావ వాతావరణంలో చేసుకోవాలని, గతంలో జరిగిన చిన్నిపాటి ఘటనలు కూడా జరగకుండా అన్ని మతాలు వారి భావనలను గౌరవిస్తూ ఉత్సవాలు చేసుకోవాలని రాయచోటి సీఐ తులసిరామ్ తెలిపారు.


అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన మతసామరస్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి సమస్యలకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని ఆయన గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని మతాల పెద్దలతో  సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సుండుపల్లె సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎంకె హుస్సేన్ మాట్లాడుతూ లోపల మండలంలో ప్రజలంతా మంచి సోదరుభావంతో మెలిగేవారని,  గత సంవత్సరం జరిగిన చెడు అనుభవాల దృష్ట్యా  ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,  ఈ సంవత్సరం చేసుకునే ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయక సంఘటనలకు తావులేకుండా జరుపుకోవాలని ఆయన  అన్ని మతాల పెద్దలకు విజ్ఞప్తి చేశారు. తిరుణాలలో చాందిని బండ్లు కట్టేవారు ప్రత్యేక జాగ్రత్తలు వారు తెలిపారు. కార్యక్రమంలో అన్ని మతాల పెద్దలు ఉత్సవాల నిర్వాహకులు పోలీస్ అధికారి సీఐ తులసీరామ్. ఎస్సై  ఎస్.కె హుస్సేన్ పాల్గొన్నారు.