రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

 రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్



AP : రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్' చెప్పారు ముఖ్యమంత్రి జగన్. ' రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నా' అని అన్నారు.