మందుబాబులకు బిగ్ షాక్.. ఏపీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు

మందుబాబులకు బిగ్ షాక్.. ఏపీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఎన్నికల సమయంలో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రభుత్వ రిటైల్ దుకాణాల్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధిం


చింది ఎలక్షన్ కమిషన్. ఎంసీసీ నిబంధనల ప్రకారం గత సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపు ఎంత వరకు అమ్మకాలు జరిగాయో అంతే మేరకే అమ్మకాలు జరపాలని ఈసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.


ఈ నేపథ్యంలో గత ఏడాది ఇదే నెలలో నమోదైన మద్యం అమ్మకాల పరిమాణాన్ని బట్టి రిటైల్ దుకాణాల్లో విక్రయించాల్సిన మద్యం పరిమాణాన్ని నిర్ణయిస్తున్నారు అధికారులు.


అదేవిధంగా ఏపీ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి సరఫరా అయ్యే మద్యం సప్లయ్ పై ఎక్సైజ్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు మద్యాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీనికితోడు వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో మద్యం, బీరుకు డిమాండ్ భారీగా ఉంది. దీంతో మద్యం రిటైల్ దుకాణాలు ఇష్టానురంగా విక్రయాలు జరుపుతుండటంతో ఏపీఎస్ బీసీఎల్ డిపోల నుంచి భారీగా మద్యం నిల్వలను ఎత్తివేయాల్సి వస్తోంది.


ఈ తరుణంలో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి మద్యం నిల్వల ఎత్తివేత, అమ్మకాలపై ప్రతిరోజూ జిల్లా ఎన్నికల అధికారికి నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించడంతో పాటు నిల్వల ఎత్తివేతపై కూడా ఆంక్షలు విధించారు.


అయితే రాత్రి వున్న షాపు మరుసటి రోజుకల్లా మూత పడుతుండటంతో ఎందుకు మూసారో ఏమి జరిగిందో అర్థంకాక తలలు పట్టుకుంటున్న మద్యం ప్రియులు తలలు పట్టుకుంటున్నారు. కాగా మే 13న రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్, జూన్ 4న ఓట్ల లెక్కింపునకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో ఒకటి రెండు స్థానాలు మినహా అన్ని పార్టీల అభ్యర్థుల జాబితా పూర్తయింది. వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన నేతలు రోడ్డెక్కడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.