విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

 *విశాఖ యువకుడికి రూ. కోటి స్కాలర్‌షిప్.. ఎంబీఏ సీట్ ఆఫర్ చేసిన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ


*


విశాఖ నగరానికి చెందిన ఒబిలిశెట్టి శ్రీరామ్ వరుణ్ అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చోటు దక్కించుకున్నాడు. గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ స్థానాన్ని సాధించాడు. అంతేకాదు కోటి రూపాయల ఉపకార వేతనాన్ని కూడా పొందాడు. ఈ విషయాన్ని సగర్వంగా ఉన్నట్లు చెప్పారు శ్రీరామ్. అమెరికాలోని ఐవీ లీగ్ యూనివర్సిటీలో కూడా తనకు సీటు లభించిందని, అదే సమయంలో స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో సీట్ రావడంతో అందులోనే చేరాలని నిర్ణయించుకున్నట్టు శ్రీరామ్ వరుణ్ తెలిపారు. దేశంలో చాలా తక్కువ మందికే స్కాలర్‌షిప్‌తో కూడిన సీటు లభిస్తుందని, రాష్ట్రం నుంచి తనకు ఈ అవకాశం లభించిందని శ్రీరామ్ వివరించారు.


ఇంతటి ఘనత సాధించిన శ్రీరామ్ వరుణ్ తల్లిదండ్రులు ఎవరా అంటూ పెద్ద ఎత్తున సెర్చ్ ప్రారంభం అయింది. తండ్రి డాక్టర్‌ వి.రాజ్‌కమల్‌ ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శస్త్ర చికిత్స విభాగ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వరుణ్ తల్లి డాక్టర్‌ సౌదామిని. ఈమె ప్రస్తుతం విశాఖలో ప్రముఖ గైనకాలజిస్టు.