Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు గాజువాక పరిసర ప్రాంతాలలో ముఖ్యమైన పోలీస్ స్టేషన్లను, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లను,పోలింగ్ బూత్ లను సందర్శించి

 2024 సాధారణ ఎన్నికల నేపద్యంలో అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు గాజువాక పరిసర ప్రాంతాలలో ముఖ్యమైన పోలీస్ స్టేషన్లను, క్లిష్టమైన పోలింగ్ స్టేషన్లను,పోలింగ్ బూత్ లను సందర్శించి




, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును పరిశీలించి, అధికారులకు తగు సూచనలను జారీ చేశారు.
                               నగరంలో గాజువాక , మింది ప్రాంతాలలో పోలింగ్ కేంద్రాల ను సందర్శించిన సీపీ గారు ఎన్నికల వేళ ఓటర్లు ప్రశాంత వాతావరణంలో వారి ఓటును వినియోగించుకునేలా తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించారు, గత ఎన్నికల సమయంలో నిర్వర్తించిన విధి విధానాలను పరిగణలోనికి తీసుకొని, మరింత పకడ్బందీగా, పారదర్శకంగా  ఓటింగ్ జరిగేలా తగు చర్యలను అధికారులకు ఆదేశించారు,పోలింగ్ స్టేషన్ల దగ్గర CCTV ఏర్పాట్ల పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, త్వరితగతిన అన్ని పోలింగ్ కేంద్రాలలోCCTV కెమెరాలు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ ఆదేశించారు.
                               క్లిష్టమైన పోలింగ్ స్టేషన్ల పరిధిలో బైండ్ ఓవర్ చేసిన రౌడీ షీటర్ల వివరాలను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ తో, సౌత్ ఏ.సి.పి,  డి.సి.పి-2 ఎం.సత్తిబాబు గారి తో కలిసి,  కొందరి రౌడీ షీటర్ల ఇళ్ళ వద్దకు స్వయముగా వెళ్లి వారి హజరునీ, చర్యలను పరిశీలించి,ఎన్నికల వేళ పూర్తి బాధ్యతతో ఉండాలనీ, ఏటువంటి చట్ట వ్యతిరేక చర్యలలో పాల్గొన్నా, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా , ఎటు వంటి జాప్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
                               పోలీస్ స్టేషన్లను సందర్శించిన సీపీ గారు అక్కడి సిబ్బందితో సమావేశమయ్యి, ఎన్నికల విధులుతో పాటూ , శాంతి భద్రతలు, క్రైమ్, ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు, అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏటువంటి ఏమరుపాటూ లేకుండా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ను , మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్  నూ అమలయ్యేలా విధులు నిర్వహించాలని తెలిపారు , ఎప్పటికప్పడు అవసరమైన ముందస్తు చర్యలను తగు సిబ్బందితో చేపట్టాలని ఆదేశించారు
                               ఎన్నికలను  ప్రశాంతంగా మరియు పారదర్శకంగా జరిగేటట్లు విధులను నిర్వహించాలని , నగర ప్రజలందరు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు.

                               నగర పోలీసు తరపున,
                                   విశాఖపట్నం సిటీ.