Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు నగర పోలీస్ మీటింగ్ హల్ నందు


*విశాఖపట్నం సిటీ,*

*తేదీ:09-02-2024*


                   *అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఈ రోజు నగర పోలీస్ మీటింగ్ హల్ నందు






విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ సభ్యులు కలిసి సమావేశం నిర్వహించి, (DDS) దిశా దివ్యాంగ సురక్ష హెల్ప్ లైన్ వినియోగం పై అవగాహనా కల్పించారు.

                  సుమారు  300 మంది దివ్యాంగులు పాల్గొన్న ఈ సమావేశం లో దిశా దివ్యాంగ సురక్ష టోల్ ఫ్రీ నెంబర్ 7337324466 కు ఆపదలో ఉన్నప్పుడు వీడియో కాల్, వాయిస్ కాల్, టెక్స్ట్ మెసేజెస్ లేదా వాయిస్ మెసేజెస్ ద్వారా పోలీసులను సంప్రదించినట్లయితే తక్షణమే లోకల్ పోలీస్ వారిని అప్రమత్తం చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా బాధితులకు తగిన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దివ్యాంగులు తమ సమస్యలను నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ 7337324466 ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఫిర్యాదు చేసి తక్షణం స్థానిక పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. ఇప్పటి వరకూ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు రాజస్థాన్ , ఒరిస్సా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటివి సుమారు 12 రాష్ట్రాల నుండి 65 పైగా కాల్స్ వచ్చాయని, అందులో ఇతర రాష్ట్రాలు ప్రాంతాల కాల్స్ ను ఆయా ప్రాంతాల కంట్రోల్ రూంలకు తెలిపామని, వారు పై దిశా దివ్యాంగ సురక్ష టోల్ ఫ్రీ నెంబర్ల పట్ల తమ హర్షం తెలియజేశారు.

                         సీపీ గారు దివ్యాంగులతో మాట్లాడుతూ ఎటువంటి ఆపదలో అయినా పోలీసు వారు మీకు అండగా ఉంటామని తెలియజేశారు, డెమో చుపించుట కోసం మీటింగ్ హల్ నుండి సదరు టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి, ఫిర్యాదు చేయడం, దిశా దివ్యాంగ సురక్ష టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా తమ భద్రతకు మరింత భరోసా కల్పించారని, అందుకు సీపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అనీ సదరు దివ్యాంగులు తెలియజేశారు.

 దివ్యాంగులు కొందరు తమ సమస్యలను నేరుగా సిపి గారికి తెలియజేశారు. అందులో ఒకరు తమ షాప్ ను అద్దెకు తీసుకొని అద్దె చెల్లించడం లేదు మరియు షాప్ ఖాళీ చేయడం లేదు అని, మరొకరు తనకు సంబంధించిన భూమిని అక్రమించారని, ఒక మహిళ తన మామ గారు ఆమె భర్తతో కలిసి ఉండనివ్వడం లేదు అని, మరొకరు ఆన్లైన్ లో వస్తువులు కొని మోసపోయినట్లు, మరొకరు బంగారం పోయినట్లు గతంలో ఇచ్చిన ఫిర్యాదును పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భముగా వారి సమస్యలను పూర్తిగా అర్ధం చేసుకున్న సీపీ గారు సదరు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

                          ప్రజలకు 0891-2523408 నంబరు ద్వారా డయల్ యువర్ సి.పి కార్యక్రమం నందు ప్రతీ నెలా 01 మరియు 15వ తేదీలలో ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల వరకూ,వృద్దుల ఫిర్యాదుల కోసం 12:00 నుండి 12:30 అదనముగా 30 నిమిషాలు కేటాయించడం జరుగుతున్న విషయం విదితమే అదేవిధముగా ప్రతి నెలా 02 మరియు 15 వ తేదీలలో ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల మధ్య అంధుల సమస్యల నిమిత్తం వారికి 7337324466 నంబరును, దివ్యాంగుల సమస్యల నిమిత్తం వారికి 7337434422 నంబరుతో పాటుగా సైన్ లాంగ్వేజ్ తెలిసిన నిపుణురాలు అందుబాటులో ఉంచి వారి సమస్యలకు సత్వర పరిష్కారం చేపడతామని తెలిపారు. అదేవిధముగా దిశా దివ్యాంగ సురక్ష కంట్రోల్ మరియు ఇతర సిబ్బందిని పర్యవేక్షించడానికి ప్రత్యేకముగా ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించడం జరిగినది.

                                విశాఖ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ద డెఫ్ సభ్యులు కొంతమందికి ప్రత్యక్షముగా అవగాహన కలిగించుటకు కమిషనర్ వారి కార్యాలయ ఆవరణలో గల పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్,దిశా దివ్యాంగ సురక్ష కంట్రోల్ నూ చూపించారు, దివ్యాంగుల టోల్ ఫ్రీ నెంబరు కు కాల్స్ వస్తే సైన్ లాంగ్వేజ్ తెలిసిన నిపుణురాలు కాల్ రిసీవ్ చేసుకుని, ఫిర్యాదు సైన్ లాంగ్వేజ్ ద్వారా తెలుసుకొని, వెంటనే పక్కనే ఉన్న కంట్రోల్ రూం సిబ్బందికి తెలియజేయడం, వారు సదరు దివ్యాంగ ఫిర్యాధికి సమీపంలో గల పోలీసు సిబ్బందిని పంపడం, దివ్యాంగ ఫిర్యాధికి వద్దకు చేరిన పోలీసులు తిరిగి కంట్రోల్ రూం వద్ద గల లాంగ్వేజ్ తెలిసిన నిపుణురాలి తో వీడియో కాల్ మాట్లాడి ఫిర్యాదును పరిష్కరించి, సదరు దివ్యాంగరాలిని సురక్షితముగా ఆమె గమ్యం వద్ద చేర్చే విధానం గమనించిన విద్యార్థినీ , విద్యార్థులు దిశా దివ్యాంగ సురక్ష టోల్ ఫ్రీ నెంబరు ద్వారా తమ భద్రతకు మరింత భరోసా కల్పించారని, అందుకు సీపీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అనీ తెలియజేశారు.


                               నగర పోలీసు తరపున,

                                    విశాఖపట్నం సిటీ.