లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌ (అరుణ్ గోయల్తన పదవికి రాజీనామా చేశారు.

 ఢిల్లీ..


లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌(Election Commission) అరుణ్‌ గోయెల్‌ (Arun Goel) కీలక నిర్ణయం ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు.


తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి(President of India) పంపగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు. 


ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇక మిగిలింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ మాత్రమే మిగిలి ఉన్నారు.   


మార్చి 15 వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న వార్తల నేపథ్యంలో  అరుణ్ గోయల్ రాజీనామా దేశ వ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసినది..