విశాఖ సీపీ రవిశంకర్
విశాఖ:
విశాఖలో డ్రగ్స్ మాఫియా దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.. సీబీఐ రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడంతోపాటు సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే fir నమోదు చేసింది. కాగా ఈ విషయం పై నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ
విశాఖ లో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్ లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేస్ పూర్తిగా సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు.
సీబీఐ తమను కోరిన మీదట విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ ను పంపమన్నారు.
మా వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని జరుగుతున్న
వ్యాఖ్యాలు ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
విశాఖ లో మాదక ద్రవ్యాలు మీద..ఉక్కు పాదం మోపుతున్నామని,గంజా, మత్తు పదార్ధల విక్రయాలతో బాటు వాటిని సేవించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అలాగే ఎక్కడైతే డ్రగ్స్ దొరికాయని సిబిఐ ప్రకటించిందో ఆ ప్రాంతం
కంటైనర్ టెర్మినల్ తమ పోలీస్ కమిషనరేట్ పరిధీ కూడా కాదన్నారు.
కస్టమ్స్ ఎస్పీ పిలవడం వల్ల తాము ఘటనా స్థలానికి వెళ్ళమని సీపీ తెలిపారు.
ఎన్నికల కోడ్ నేపధ్యం లో రాజకీయ వత్తిడులు ఏవి ఈ కేసుకు సంబంధం లేదని స్పష్టం చేశారు.