ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి
అనకాపల్లి
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగకుండా పటిష్ఠమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఆసుపత్రులు, పాఠశాలలు “ఐరాడ్” యాప్ ను తప్పని సరిగా డౌన్లోడ్ చేసుకోవాన్నారు. బి.ఐ.ఎస్. స్టాండర్డ్ లేని హెల్మెట్స్ అమ్మకుండా చూడాలని, వాటిని అమ్మే షాపులపై కేసులు నమోదు చేయాలని పోలీసు, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దేవాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద వేగనిరోధకాలు (ప్పీడ్ బ్రేకర్స్) ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నియంత్రించాలన్నారు. హెల్మెట్ ధరించని వారిని సి.సి.కెమేరాల ద్వారా గుర్తించి వారికి జరిమానా విధించేలా తగిన సాంకేతికతను ముందుగా లంకెలపాలెం కూడలిలో ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండింట్ కె.వి.మురళీ కృష్ణ మాట్లాడుతూ పోలీసు, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. రహదారి భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.స్మరణ్ రాజ్, అడిషనల్ ఎస్.పి. బి.విజయభాస్కర్, జిల్లా రవాణా అధికారి కె.వి.ప్రకాశరావు, డియంఅండ్ హెచ్ వో డాక్టర్ ఎ.హేమంత్, డిసిహెచ్ ఎస్ డాక్టర్ శ్రీనివాస్,ఆర్ అండ్ బి ఈఈ రమేష్, పోలీసు, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జారీ పౌర సంబంధాల అధికారి, అనకాపల్లి