ప్రభుత్వ ప్రాంగణాల్లో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదు
*
*నూతన అనుమతులు జారీ చేయరాదు*
*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*
*జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో భాగస్వామ్యమైన జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున*
విశాఖపట్నం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించ రాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడలపై రాతలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు.
ఎన్నికల సంసిద్ధత, ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి డా. ఎ.మల్లిఖార్జున, జీవీఎంసి కమిషనర్ సీఎం. సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసి అడిషనల్ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్, డిఆర్వో కె.మోహన్ కుమార్, ఆర్.ఓలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు మేరకు హైవేలు, ప్రధాన రహదారులు ప్రక్కన ఇప్పటి వరకు ఉన్న హోర్డింగులను సమాన ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో వున్నందున నూతన అనుమతులు జారీ చేయరాదని ఆయన సూచించారు.ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రాంగణాల్లోని వాణిజ్య స్థలాల్లో ఎటువంటి రాజకీయ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించరాదని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు పరచడంలో ఎటువంటి అలసత్వం వహించరాదని పేర్కొన్నారు. జిల్లా సరిహద్దు చెక్ పోస్టుల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ ఉండాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలుపరచడం,ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించడం, సి- విజిల్ ద్వారా అందే ఫిర్యాదుల సకాలంలో పరిష్కరించడం తదితర అంశాలపై దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు.ఈ.వి.ఎం ల రాండమైజేషన్ ప్రక్రియ ప్రారంభించాలని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో జీవీఎంసి కమిషనర్ సీఎం. సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జీవీఎంసి అడిషనల్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, డిఆర్వో కె.మోహన్ కుమార్, ఆర్.ఓలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------------------
జారీ : డిఐపిఆర్ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం