నేడు తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా

 *నేడు తలపడనున్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా


హైదరాబాద్:మార్చి23

ఐపిఎల్ సీజన్17లో భాగంగా శనివారం సన్‌రైజ ర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. ఈడె న్ గార్డెన్‌లో జరిగే మ్యాచ్‌ లో  కోల్‌కతా సన్ రైడర్స్‌తో హైదరాబాద్ తలపడనుంది.


కొన్ని సీజన్‌లుగా పేలవ మైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న సన్‌రైజర్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో హైదరాబాద్ బరిలో దిగుతోంది.


అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న కమిన్స్ సన్‌రైజర్స్‌ను ఎలా నడిపిస్తాడనేది అందరి లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా భారీ ఆశలతో టోర్నమెం ట్‌లో బరిలో దిగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ వేటను ప్రారంభిం చాలనే పట్టుదలతో ఉంది.



శ్రేయస్ అయ్యర్ సారథ్యం లోని కోల్‌కతాలో స్టార్ ఆట గాళ్లకు కొదవలేదు. ఫిలిప్ సాల్ట్, ఆండ్రీ రసెల్, వెంక టేష్ అయ్యర్, సునీల్ నరైన్, నితీష్ రాణా, మిఛెల్ మార్ష్, మనీష్ పాండే, వరు ణ్ చక్రవర్తి, రింకు సింగ్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.


దీంతో సన్రైజర్స్ హైదరా బాద్ కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. గతంతో పోల్చితే ఈసారి సన్‌రైజర్స్ కాస్త బలంగా కనిపిస్తోంది. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, భువనే శ్వర్ కుమార్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్, మార్కొ జాన్సన్ వంటి స్టార్ క్రికెటర్లు జట్టులో ఉన్నారు.


దీంతో హైదరాబాద్ ఈసారి మెరుగైన ప్రదర్శనతో అద రగొట్టాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ కమిన్స్ ఇప్ప టికే ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ఆరంభ మ్యాచ్ నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నాడు.


ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితా న్ని తారుమారు చేసే ఆటగా ళ్లు ఉండడంతో హైదరాబాద్‌ ను తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. ఈ సీజన్ ద్వారా మళ్లీ పూర్వవైభవం సొంతం చేసుకోవాలనే లక్షంతో సన్‌రైజర్స్ పావులు కదుపుతోంది. ఆరంభ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవి శ్వాసాన్ని రెట్టింపు చేసుకో వాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది.