*అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆదేశాలతో నిన్న తేదీ 13-03-2024 న నగర వ్యాప్తంగా గల స్పా/ మసాజ్ కేంద్రాలపై విస్తృత దాడులు జరిపిన నగర పోలీసులు.*
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నగర వ్యాప్తంగా మొత్తం 64 స్పా/ మసాజ్ కేంద్రాలపై విస్తృత దాడులు జరిపిన నగర పోలీసులు, సుమారు 200 మంది సిబ్బందితో నిర్వహించిన ఈ దాడులులో 04 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేయడం తో పాటుగా, ఈశాన్య రాష్ట్రాల కు చెందిన 17 మంది అమ్మాయులను స్వధర్ హోం కు అప్పగించడం జరిగినది, సదరు దాడులలో 07 మంది విటులు,స్పా/ మసాజ్ కేంద్ర నిర్వాహకులతో పాటుగా, విటుడి గా ఉన్న నగర పోలీసు శాఖకు చెందిన ఒక ఎస్.ఐ ను కూడా అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేయడం జరిగినది.
నగర సీపీ గారి ఆదేశాలతో ఇదివరకూ పలు మార్లు స్పా/ మసాజ్ కేంద్రాలపై కేంద్రాల పైన దాడులు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. నగరంలో గల స్పా/ మసాజ్ కేంద్రాల నిర్వాహకులకు, ప్రజలకు స్పా/ మసాజ్ కేంద్రాల వద్ద అమలు చేయల్సిన విధివిధానాల పై స్పష్టమైన నిబంధనలను తెలియపరచడం జరిగినది.
కావునా స్పా/ మసాజ్ కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరించిన లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని, స్పా/ మసాజ్ కేంద్రాల నిర్వాహకులకు, ప్రజలకు నగర పోలీసుల విజ్ఞప్తి.