అనకాపల్లి జిల్లా పోలీసు

 *అనకాపల్లి జిల్లా పోలీసు





*


*జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్.,* గారి ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది మార్చి 14న మద్యం, ఇసుక, గంజాయి, కోడిపందాలు మరియు జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై దాడులు నిర్వహించి, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్  కేసులు నమోదు చేశారు.


❇️కోడి పందాలు, జూదం తదితర లు అరికట్టేందుకు పోలీసులు దాడి చేసి ఒక కేసుల నమోదు చేసి, 4గురు నిందితులను అరెస్టు చేసి, రూ.2,220/- నగదును స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు.


❇️మద్యం సేవించి వాహనాలు నడిపిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. 


❇️బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించిన 23 మంది పై 

కేసులు నమోదు చేశారు.


❇️ఎం.వి.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 323 కేసులు నమోదు చేసి, ఈ-చలానా గా రూ.72,840/- లు విధించారు.


❇️ప్రజలకు దిశా🆘యాప్

పట్ల అవగాహన కల్పించి, 12 మందితో యాప్ డౌన్లోడ్ చేయించారు. 6,03,534 మంది తో యాప్ ను డౌన్లోడ్ చేయించగా, 2,13,848 మందితో రిజిస్ట్రేషన్ చేయించారు.


❇️ *జిల్లా పోలీసులు, సెబ్ అధికారులు దాడి చేసి, 31 కేసులు నమోదు చేసి, 29 మంది నిందితులను అదుపులోనికి తీసుకుని, 39 లీటర్ల అక్రమ మద్యం, 157 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకుని, 3,700 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసిన పోలీసులు.* 


❇️ఎస్పీ గారి ఆదేశాలతో 

రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, పోలింగు కేంద్రాలను సందర్శించి, గ్రామస్తులతో సమావేశమయ్యి ఎన్నికలకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని, ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కేంద్ర పోలీస్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహించి, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేలా ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని  అధికారులను ఆదేశించారు.


*జిల్లా పోలీసు కార్యాలయం,*

*అనకాపల్లి.*