అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2024

 *పత్రికా ప్రకటన*

విశాఖపట్నం సిటీ,

తేదీ:08-03-2024.


                       *అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., వారు ఆర్ముడ్ రిజర్వ్ వద్ద గల పోలీసు కాన్ఫరెన్స్ హల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2024




పురస్కరించుకొని పోలీసు శాఖకు చెందిన మహిళలకు సత్కారించడం జరిగినది.*

                           శ్రీమతి రోష్ని అపరంజి కొరాటి, ఐ.ఎ.ఎస్., జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్, విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ వారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమం నందు జాయింట్ సీ.పీ శ్రీ కే.ఫక్కీరప్ప కాగినెల్లి, ఐ.పీ.ఎస్., గారు, డి.సి.పి-1(ఎల్&ఓ) శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐ.పీ.ఎస్.,గారు,డి.సి.పి(క్రైమ్స్)శ్రీమతి పి.వెంకటరత్నం గారు,  డి.డి ఆఫ్ ప్రాసిక్యూషన్స్ శ్రీమతి యం.శైలజా గారు, ఎ.డి.సి.పి లు, ఎ.సి.పి లు, మహిళా పోలీసు అధికారులు, ఉమెన్ పి.సి లు, హెచ్.సిలు, మహిళా పోలీసులు, మహిళా హోం గార్డులు పాల్గొన్నారు.

                             నగర పోలీసు శాఖ తరపున అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2024 వ కేక్ ను కట్ చేసి కార్యక్రమం ప్రారంభించారు, మహిళా సాధికారత పై, మహిళలు మరింత ఉన్నత దిశగా అడుగులు వేయడానికి తీసుకోవలసిన చర్యలపై టీ. కల్యాణి గారు, సీఐ దిశా, ఎన్. సునీత గారు, ఎస్.ఐ , పి.యం పాలెం, కే.వి.జ్యోతి గారు , ఏ.ఎస్.ఐ, 3టౌన్ క్రైమ్స్  మాట్లాడి మహిళా సాధికారత పై తమ తమ ఆలోచనలు సభా ముఖముగా పంచుకున్నారు.

                          జాయింట్ సీ.పీ శ్రీ కే.ఫక్కీరప్ప కాగినెల్లి, ఐ.పీ.ఎస్., గారు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2024 సందర్భముగా నగర పోలీసు శాఖ నందు విధులు నిర్వహిస్తున్న మహిళల కోసం *వైజాగ్ సిటీ పోలీస్ మహిళా కో- ఆపరేటివ్ సొసైటీ* ని ఏర్పాటు చేయడం జరిగిందనీ, దీని ప్రధాన ఉద్దేశం మహిళలకు ఆర్ధికముగా మరింత భరోసా కల్పించడం అనీ, దీనికోసం ప్రత్యేకంగా పోలీసు కార్పస్ ఫండ్ నుండి 10 లక్షల రూపాయలు అందించడం జరిగిందనీ, మొత్తం మహిళలతో *వైజాగ్ సిటీ పోలీస్ మహిళా కో- ఆపరేటివ్ సొసైటీ* బాడీ ఏర్పాటు చేసి త్వరలోనే పని ప్రారంభిస్తుందనీ, పోలీసు శాఖ మహిళలు ఈ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీ రేటుకు నగదు తీసుకోవచ్చని తెలియజేశారు.

                            అనంతరం ముఖ్య అతిధి శ్రీమతి రోష్ని అపరంజి కొరాటి, ఐ.ఎ.ఎస్., చేతుల మీదుగా*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పోలీసు శాఖ కుటుంబ సలహా నివేదిక* అను పుస్తకమునూ, *ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - పోలీసు శాఖ ఫ్యామిలీ కౌన్సెలింగ్ కు హజరవుటకు నోటీసు* అను పుస్తకమును విడుదల చేశారు. ముఖ్య అతిధి శ్రీమతి రోష్ని అపరంజి కొరాటి, ఐ.ఎ.ఎస్., గారు మాట్లాడుతూ పోలీసు శాఖా ఇంత ఘనముగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2024 నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, మహిళలు అన్ని రంగాలలోనూ ప్రతిభ చూపగలరనీ, ప్రతీ మహిళా తాను చేయాలనుకున్న పనులను వెనుకడుగు వేయకుండా చేయాలని అది మహిళల అభ్యున్నతికి సహకరిస్తుందని తెలిపారు, పోలీసు శాఖ నందు విధులలో ప్రతిభ కనబరిచిన మహిళలను ప్రత్యేకముగా గుర్తించి సత్కరించడం స్ఫూర్తిదాయకం అనీ తెలిపారు.

                           సీపీ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్.,గారు మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు గొప్పగా రాణిస్తున్నారనీ, మహిళలుకు  ఓర్పు, సహనం ఎక్కువని తెలిపారు, ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎందరో స్ఫూర్తి దాయక మహిళలలు ఉన్నారనీ, ముఖ్య అతిథి ఒక ఐ.ఎ.ఎస్.,,  ఉమెన్ సీఐ యోగాలో ఎన్నో అవార్డులు సాధించి పోలీసు శాఖ కీర్తి పెంచిందని , ఏ.ఎస్.ఐ, 3టౌన్ క్రైమ్స్ అరవైయేళ్ళ వయస్సులో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడి ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన *వైజాగ్ సిటీ పోలీస్ మహిళా కో- ఆపరేటివ్ సొసైటీ* నగర పోలీసు శాఖ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

                             కార్యక్రమం నందు చివరగా మొత్తం 26 మంది నగర పోలీసు శాఖ మహిళలలకు (1.WCI టి.కళ్యాణి గారు , 2.ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్ M. శైలజ గారు, 3.సీనియర్ అసిస్టెంట్ పి.చంద్రవదన గారు, 4.WCI L.రేవతమ్మ గారు, 5.WSI N. సునీత గారు, 6.WASI D. కాంతం గారు, 7.WASI K.V. జ్యోతి గారు, 8.WHC E.సుశీల గారు, 9.WHC వి అరుణ కుమారి గారు, 10.WHC గంగమ్మ గారు, 11.WHC అలిసన్ జాయ్స్ గారు , 12.WPC కె మౌనిక గారు,13. WPC SK రహీమ్ తునీషా గారు, 14.WPC కె. దివ్య వాణి గారు,15. ARWPC జి.సత్యాలమ్మ గారు, 16.WHG సారిక గంగా రత్నం గారు,17. WHG M .ఈశ్వరి గారు, 18.WHG బి.శేషు కుమారి గారు, 19.WHG V. ప్రమీల రత్నప్రభ గారు, 20.మహిళా పోలీసు A .ఊర్మిళ గారు, 21.మహిళా పోలీసు G. కుసుమ శ్రీ కుమారి గారు,22. మహిళా పోలీసు D. దేవి గారు, 23.మహిళా పోలీసు B. మాధురి లత గారు, 24.మహిళా పోలీసు Y. ఆశా లత గారు, 25.మహిళా పోలీసు G. రాజ్య లక్ష్మి గారు, 26.WHG (దిశా దివ్యాంగ్ సురక్ష) V. సునీత గారు) సత్కరించి, ప్రశంసా పత్రాలు, అవార్డునూ అందజేశారు.

                      సదరు కార్యక్రమానికి హాజరైన పోలీసు శాఖా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీపీ గారు చేపట్టిన ఈ కార్యక్రమం పట్లా, ప్రతిభ కనబరిచిన మహిళలకు సత్కారం చేయడం పట్లా, ముఖ్యముగా మహిళల ఆర్థిక భరోసా కల్పించే సదుద్దేశంతో నగర పోలీసు శాఖ మహిళలకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన *వైజాగ్ సిటీ పోలీస్ మహిళా కో- ఆపరేటివ్ సొసైటీ* పట్లా తమ హర్షం వ్యక్తం చేస్తూ సీపీ గారికి, జాయింట్ సీపీ గారికి ఇతర పోలీసు ఉన్నతాధికారులకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.


                         నగర పోలీస్ తరుపున,

                             విశాఖపట్నం సిటీ.