Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు డయల్ యువర్ సి.పి ప్రారంభం

కమిషనర్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు  డయల్ యువర్ సి.పి  కార్యక్రమాన్ని ఈ రోజు కమిషనరేట్ నందు నిర్వహించడం జరిగినది.

                        ప్రతి నెల 01 మరియు 15వ తేదీలలో ఉదయం 11:00 గంటల నుండి 12:00 గంటల వరకూ


ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ గారు 0891-2523408 నంబరు ద్వారా అందుబాటులో ఉండి 08 మంది కాలర్స్ తో ఫోన్ మాట్లాడి, తమ సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకొని ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది. కాలర్స్ ఇచ్చిన ఫిర్యాధులలో భూ వివాదాలు,భార్య భర్తల గొడవలు, సివిల్ కేసులు, వ్యాపారం కోసం నగదు ఇచ్చి మోసపోయిన వారు, నగర ట్రాఫిక్ సమస్యలు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.

                        వృద్దుల ఫిర్యాదుల కోసం 12:00 నుండి 12:30 అదనముగా కేటాయించిన 30 నిమిషాల సమయంలో రెండు (02) ఫిర్యాదులు రావడం జరిగినది.


🟤PM పాలెం కి చెందిన 83 సంవత్సరాల వయస్సు గల వృద్దుడు తమ కుటుంబంలో నలుగురు వయోవృద్ధులు కలరని, ఇంటి పక్కవాళ్ళు డాగ్స్ ని పెంచుకుంటున్నారనీ ,అవి తరచూ అరుస్తూ ఉండటంతో, అందరం వయోవృద్ధులు కావడం వల్ల ఫోన్ రింగ్, కాలింగ్ బెల్ వంటి అత్యవసర శబ్దాలు వినపడక పోవడం వలన తమకు ఇబ్బందిగా ఉందని ఫిర్యాదు చెయ్యటం జరిగింది.


🟤ఆరిలోవ కి చెందిన 70సంవత్సరాల వయస్సు గల వ్యక్తి తన కుమారుడు చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బు తీసుకొని 10 రోజులతర్వాత వస్తాను అని చెప్పి కోడలు అమ్మ గారి ఇంటికి వెళ్లి ఇంకా రాలేదు అని మాకు ఆధారం లేకుండా వదిలేసి వెళ్లిపోయిందని న్యాయం చెయ్యమని ఫిర్యాదు చెయ్యటం జరిగింది. 


                          పోలీస్ కమిషనర్ గారు అన్ని కాల్స్ నూ పూర్తిగా పరిశీలించి వాటిని నిర్ణీత కాలంలో పరిష్కరించే దిశగా తగు ఆదేశాలను జారీ చేశారు.

                          గతంలో జరిగిన "డయల్ యువర్ సి.పి" కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు, వాటిలో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ లో వస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలగిస్తున్నారని మరియు ఫుట్ పాత్ లు ఆక్రమించి దుకాణాలు నడుపుతున్నారని వచ్చిన ఫిర్యాదులకు ఏ.సి.పి స్థాయి అధికారితో దర్యాప్తు చేయించి, ఆయా ప్రాంతాలను ప్రత్యేకముగా సందర్శించి, ప్రత్యామ్నాయ మార్గాలపై పలు ఆదేశాలు జారీ చేసి ఫిర్యాధులను పరిష్కరించారు, గత "డయల్ యువర్ సి.పి" కార్యక్రమానికి వచ్చిన  10 ఫిర్యాదులకు గానూ మొత్తం 10 ఫిర్యాధులు పరిష్కరించబడ్డాయి. 

                      డయల్ యువర్ సి.పి కార్యక్రమానికి ఈ 0891-2523


408 నంబరుకు కాల్ చేసి నేరుగా మీ సమస్యలను నగర పోలీస్ కమిషనర్ డా. ఏ.రవి శంకర్ ఐ.పీ.ఎస్., గారికి తెలియజేయవచ్చు. అదేవిధంగా సిపి గారికి వాట్సాప్ ద్వారా ఫొటోస్, వీడియోస్ తో కూడిన ఫిర్యాధులు 9493336633 నంబరుకు ఇవ్వవచ్చు, అలాగే ప్రతీ సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ద్వారా కూడా ప్రజలు పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదులు ఇవ్వవచ్చు అని తెలియజేయడం జరిగిది.