ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా

 ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా?


సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ? రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు.


బూటకపు ప్రసంగాలు కాదు.. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం.


దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్‌, టైం.. నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా.. దేని మీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్‌రెడ్డీ? అని చంద్రబాబు సవాలు చేశారు..