స్పందన కార్యక్రమ వివరాలు








నగర పోలీస్ కమిషనర్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆదేశాల మేరకు జాయింట్ సి.పి కే. ఫకిరప్ప, ఐ.పీ.ఎస్., గారు, ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ఈ రోజు నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించినారు.* 

                ఈ స్పందన కార్యక్రమంలో డి.సి.పి-01(ఎల్& ఓ) శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐ.పీ.ఎస్.,గారు, డి.సి.పి-02(ఎల్& ఓ) శ్రీ యం.సత్తిబాబు గారు, ఏ.డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ ఎం.ఆర్.కే రాజు గారు, నగర సబ్-డివిజన్ ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమం లో పాల్గొన్నారు. 

                  ఈ రోజు జరిగిన స్పందన కార్యక్రమానికి 60 మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా జాయింట్ సి.పి గారికి అందజేసినారు. జాయింట్ సి.పి గారు మరియు పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాది దారులతో మాట్లాడి, వారి వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, సమస్యకు సంబంధించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది.  

                   స్పందన కార్యక్రమంలో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులలో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్య భర్తల గొడవలు, మోసానికి సంబంధించినవి మరియు సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.


                   నగర పోలీసు తరపున

                        శాఖపట్నం సిటీ.