ఏపీ శాసనసభ ఎన్నికల్లో సీఎం జగన్ పై టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరఫున మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి) పోటీచేయనున్నారు. రవీంద్రనాథ్ టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా పనిచేశారు. జగన్ ఎక్కడ పోటీచేస్తే తాను అక్కడ పోటీచేస్తానంటూ గతంలో పలుమార్లు రవీంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే జగన్ ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం నుంచి రవీంద్రనాథ్ బరిలో దిగనుండటం గమనార్హం.