ప్రధాని విశాఖ పర్యటన





విశాఖపట్టణం, ఫిబ్రవరి 23:- భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున పరిశీలించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసే నిమిత్తం మార్చి 1న దేశ ప్రధాని విశాఖపట్టణం వస్తున్న నేపథ్యంలో ఏయూ వేదికగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సిటీ పోలీస్ కమిషన్ డా. ఎ. రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్ , హెచ్.పి.సి.ఎల్. ఉన్నతాధికారులతో పాటు ఆంధ్రా యూనివర్సిటీ మైదానాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం పరిశీలించారు. దేశ ప్రధాన మంత్రి వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బలమైన బ్యారికేడ్లు వేయాలని, విద్యుత్ సంబంధిత సమస్యకు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, తాగునీటి వసతి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. ఏయూ ఇంజీరింగ్ కళాశాల మైదానంలో ఉన్న హెలిప్యాడ్ ను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. 


పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, హెచ్.పి.సి.ఎల్. ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. ఏయే విభాగాలు ఏయే పనులు చేపట్టాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.


కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, హెచ్.పి.సి.ఎల్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రాజీవ్ గోయల్, అభిషేక్ త్రివేది, సురేంద్ర గుప్త, సిజీఎం (హెచ్.ఆర్.) కిరణ్ కుమార్ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


.......................................

జారీ, ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్టణం.