రైలు ఎక్కుతుండగా జారీపడి యువకుడి మృతి రైలు ఎక్కుతుండగాజారిపడి యువకుడు మృతి.


టెక్కలి మండలం  నౌపడ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం విశాఖకు చెందిన చెంచుల భానుచందర్రావు (35) యువకుడు రైలు బండి ఎక్కుతూ జారీ కింద పడిపోయాడు.

మూడు రోజుల క్రితం సంతబొమ్మాలి మండలం యామాల పేట గ్రామానికి వచ్చి తిరిగి విశాఖపట్నం వెళ్లేందుకు రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. వెంటనే పడిపోయిన యువకుడుని ఆసుపత్రికి తరలించి చేర్పించగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.