దేశ వ్యాప్తంగా పెండింగ్ కేసులు


దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో భారీగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టుల గురించి నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ తాజాగా స‌మాచారం అందించింది. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో ముందుంది. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ ప్రకారం.. 2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య పెరిగింది. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగాయి. బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు 53.85 శాతం పెరిగాయి. అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య పెరిగింది. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివి. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.