ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ.


రూ.15 కోట్ల వరకు ఆస్తులు గుర్తింపు..


లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జ్యోతి..


ఆమె ఇంట్లో రూ.65 లక్షల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలు..


ప్లాట్లు, ఫ్లాట్, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు గుర్తించిన ఏసీబి 

హైదరాబాద్ మాసబ్‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా పని చేస్తున్న జగజ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. జగజ్యోతి 84 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు నిన్న (సోమవారం) దొరికిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్‌ ఈఈ‌ జగజ్యోతి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో ఎక్కడపడితే అక్కడ నగదు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వారి నివాసంలో 65 లక్షల రూపాయల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. జగజ్యోతి గారి నివాసంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.          


మాసబ్‌ ట్యాంక్‌ లోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ ఆఫీస్‌ లో జగజ్యోతి ఇంచార్జి సూపరింటెండెంట్‌ గా పని చేస్తున్నారు. ఓ బిల్డింగ్ కాంట్రాక్టర్‌ నుంచి 84 వేల రూపాయలు లంచం తీసుకుంటూ నిన్న (సోమవారం) రెడ్ హ్యాండెడ్‌ గా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.


జగజ్యోతి గారు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులకు దొరికిపోయిన అనంతరం జగజ్యోతి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి కార్యాలయంతో పాటు ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.