ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ముగిసింది

 

ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు ముగిసింది


గత ఏడాది డిసెంబర్ 26 నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ చలాన్లపై రాయితీ గడువు నిన్నటితో ముగిసింది.. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు అవ్వగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలు అయ్యాయి.. మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36% మాత్రమే క్లియర్ అయ్యాయి.