వైసిపి కి ఖలేజా లేదు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్

*జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కామెంట్స్*:-

*వైసిపి కి ఖలేజా లేదు*...


*రాజధాని కోసం మాట్లాడుతున్నా ఈ వైసిపి పెద్ద మసనుషులు...పర్యటక శాఖ ముసుగు లో ఋషికొండ పై సీఎం ఆఫీస్ కట్టారు*...


*ముందు పర్యటక శాఖ బిల్డింగ్ అన్నారు..తరవాత ట్రాన్సిట్ హల్ట్ అన్నారు..ఇప్పుడు సీఎం కార్యాలయం అంటున్నారు*...


*ఈ ఐదేళ్లలో పరిపాలన రాజధాని పేరు చెప్పి నలుగురు వైసిపి పెద్దలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు తప్ప విశాఖలో పరిపాలన రాజధాని పేరు చెప్పి ఒక్క ఇటుక పెట్టలేదు*...


 *విశాఖ లో సర్క్యూట్ హౌస్, రైతుబజార్ తో కలిపి 25 వేల కోట్లు అప్పు తెచ్చారు*...


*ఇప్పుడు హైద్రారాబాద్ రాజధాని గా ఉండాలని కేంద్రం మీద ఒత్తిడి తెస్తారట...సిగ్గు ఉండాలి సుబ్బడు కి*....


*విభజన హామిలో మొదటిది పోలవరం...టిడిపి హయాంలో గేట్లుపెట్టారు, స్పిల్ వే,పనులు అయ్యాయి*..


*వైసిపి వచ్చాక కనీసం ఒక్క పని చేయలేదు సరి కదా...గండ్లు పెట్టారు.. నిర్మాణ వ్యయం పెంచి నిర్వాసితులను ముంచారు*..


*వరద వచ్చి విలీన మండలాలు మునుగి పోయేలా చేశారు*...


*పైగా అసెంబ్లీ లో పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు*...


*ఒక్కసారి విలీన మండలాలకు సీఎం వెళ్తే తెలుస్తుంది*...


*కనీసం పోలవరం ముంఫు మండలాలకు వరద వస్తే వెళ్లకుండా "చట్నీ" అనే గ్రామంలో ఉండి సోది చెప్పి వచ్చేసారు*...


*ఇక రైల్వే జోన్ విషయంలో 2016 ఏప్రిల్ 18 న విశాఖ లో రైల్ జోన్ రావాలని సీఎం జగన్ మోహన్ రెడీ స్వయంగా అన్నారు*...


*జోన్ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర స్థలం అడిగితే...2023 డిసెంబర్ 10 న దక్షిణ కోస్తా రైల్వే ఆఫీస్ కి వివాదాల్లో ఉన్న భూమీ ఇచ్చామని అధికారికంగా చెప్తున్నారు అది కూడా గిరిజనుల నుంచి లాక్కొని*...


*జోన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు స్థలం ఇవ్వడానికి నాలుగేళ్లు పట్టిందా?? వైసీపీ నేతలు చెప్పాలి*...


*22 మంది ఎంపీ లు ఉండి కనీసం రైల్వే బోర్డ్ మీటింగ్ లో కూడా పాల్గొని వైసిపి ఇప్పుడు రైల్వే జోన్ అనడం విడ్డురంగా ఉంది*...


*ఇక ప్రత్యేక హోదా కోసం కేంద్ర మెడలు వంచుతా అన్నారు*..


*బాబాయి మర్డర్ కేస్ లో తమ్ముడు బెయిల్ కోసం వంగుని కాళ్ళు మొక్కారు*...


*ఇప్పుడు చెప్పండి విభజన హామీలు మరచి పోయింది.. వైసీపీ నే*...


*రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్ర అధికార పార్టీ కి చీఫ్ గా ఉన్న పి సి సి చీఫ్ బొత్స సత్యనారాయణ..రాష్ట్ర విభజన సమయంలో ఏం చేశారు*...


*సీఎం గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజన కోసం రాజీనామా చేశారు*...


*మరి అధికార పార్టీ చీఫ్ గా ఉన్న బొత్స ఏం చేశారు...ఢిల్లీ వెళ్లి చిత్తం మీ ఇష్టం రాష్ట్ర విభజనకు సై అని లెటర్ ఇచ్చి వచ్చారు*... 


*ఇప్పుడు విభజన హామీలు కోసం పోరాడతాం అని ఉత్తర కుమారుడి కబురులు చెప్తున్నారు*...


*గూగుల్ లోకి వెళ్లి బొత్స అని కొడితే ఆబ్కారీ మంత్రి గా ఉనప్పుడు వైట్ రేషన్ కార్డ్ దారులు పేరు చెప్పి మద్యం సిండికేట్ ఇచ్చిన విషయం చెప్తోంది*... 


*ఇదే సీతమ్మధార ఏసీబి ఆఫీస్ విచారణ కు వచ్చిన ఉదంతం చెప్తుంది*...


*పరిశ్రమల శాఖ మంత్రిగా ఒక్స్ వ్యాగన్ కు 11 కోట్లు ముట్ట చెప్పి సొమ్ములు పోయినాయి ఏంటి చెత్తం అన్నారు*...

 

*ఇప్పుడు విద్యా శాఖ మంత్రి బైజుస్ ముడుపులు, డిజిటల్ క్లాస్ రూమ్ పేరిట వెనకేసుకున్న మూటలు బయటకొస్తాయి*...


*అభివృద్ధి పేరు చెప్పి జగదాంబ లాంటి సెంటర్లో చిత్రాలయా కాంప్లెక్స్ కట్టిన గొప్ప ఘనుడు బొత్స*...


*అటువంటి గురువు బొత్స ను ఆదర్శంగా తీసుకున్నారు మన ఇప్పటి పరుశ్రమల శాఖ మంత్రి గుడ్డు అమర్నాధ్*...


*మేన్నటి వరకు 13.11 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అన్నారు*... 


*ఇప్పుడు మూడు జాబితాలో సీట్ లేక పోయే సరికి 4300 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని నెంబర్ తగ్గించేశారు*...


*క్రషర్ నుంచి కొట్టేసింది 500 కోట్లు పైన ..అందుకే ఈ సారి అనకాపల్లి ఇస్తే ఎంత దోస్తాడో అని సీటు కూడా ఇవ్వలేదు*..


*వైసీపీ కి ఓటమి భయం టన్నులలో ఉంది..అందుకే మా అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార సభలు హెలికాప్టర్ కు అనుమతి అడ్డం పెడుతున్నారు*...


*ఇంకా జగన్ మోహన్ రెడ్డి కి అర్ధం కాలేదు అనుకుంటాను సినిమా లో చెప్పినట్టు గన్ చూడాలి అనుకొచ్చు తప్పు లేదు కానీ బులెట్ చూడాలి అనుకోకూడదు అన్నారు*...


*అలాగే పులితో వేట పవన్ కళ్యాణ్ గారి తో ఆట ఆడితే ప్రజా క్షేత్రం లో డిపాజిట్లు కూడా రావు*....