మన్‌ కీ బాత్‌'కు మూడు నెలల విరామం

 

Lok Sabha polls: మార్చిలో ఎన్నికల కోడ్‌.. 'మన్‌ కీ బాత్‌'కు మూడు నెలల విరామం


దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రతి నెలా చివరి ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి చేసే రేడియో ప్రసంగం 'మన్‌ కీ బాత్‌' (Mann ki Baat) ఎంతో ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే..


వచ్చే రెండు, మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) దృష్ట్యా ఈ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. తాజాగా 110వ ఎపిసోడ్‌లో ప్రసంగించిన ఆయన.. గతంలో మాదిరిగానే ఈ మార్చిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct) అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు..


'ఇప్పటివరకు నిర్వహించిన 110 ఎపిసోడ్‌లు ప్రభుత్వంతో ఎటువంటి ప్రమేయం లేకుండా నిర్వహించాం. దేశ సామూహిక శక్తి, విజయానికి ఈ ప్రసారం అంకితం' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది ప్రజల కార్యక్రమమని, ప్రజల కోసం ప్రజలచే రూపుదిద్దుకుందన్నారు. తదుపరి నిర్వహించేది 111వ ఎపిసోడ్‌ అని.. ఈ సంఖ్యకు విశిష్టత ఉందన్నారు. ఇంతకంటే గొప్ప విషయమేముంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమానికి విరామం ఇచ్చిన విషయం తెలిసిందే..