**
*మధురవాడ జర్నలిస్టుల ఆధ్వర్యం లో ధర్నా*
*పీ.ఎం.పాలెం సిఐ కు వినతిపత్రం అందజేత*
మధురవాడ
అనంతపురం జిల్లా రాప్తాడు లో ఈనెల 18వ తేదీన సిద్ధం సభలో వైయస్సార్సీపి కొందరు కార్యకర్తలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై కొందరు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ మధురవాడ జర్నలిస్టు మిత్రుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం నిరసన కార్యక్రమం,మరియు పీ.ఎం.పాలెం సిఐ వై రామకృష్ణ కు మధురవాడ జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. దాడి చేసిన వ్యక్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించి, పత్రిక స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ముందుగా జీవీఎంసీ జోన్ -2 కార్యాలయం అంబెడ్కర్ విగ్రహం వద్ద ఆంధ్ర జ్యోతిపత్రికా ప్రతినిధి పై దాడిని నివసిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినదించారు. అంబేద్కర్ విగ్రహం నుండి పీఎం పాలెం పోలీస్ స్టేషన్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మధురవాడ జర్నలిస్ట్ మిత్రులు పాల్గొన్నారు.