జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు






ఫ్లాష్ ఫ్లాష్ 


డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ 


హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ రఘునందనరావు ధర్మాసనం ముందు విచారణ


 పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్


ఎస్ జి టి టీచర్ పోస్టులకు బిఈడి అభ్యర్థులను కూడా అనుమతించడo సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్


బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది


ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు


ఎఎస్ జి టీ పోస్టులకు బీ ఇ డి అభ్యర్థులను అనుమతించవద్దు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం



 సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ జీవో పై స్టే విధిస్తూ ఆదేశాలు


నియామక ప్రక్రియ కొనసాగించాలి అంటే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొనసాగించాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం


తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సంచలన నిర్ణయం


న్యాయస్థానం నిర్ణయంతో ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులకు న్యాయం