డాగ్ స్క్వాడ్ ను, పోలీస్ హ్యాపీ హోమ్స్, పునరనిర్మాణం.





                      ఈ రోజు అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి సమక్షంలో నగర ఆర్ముడ్ రిజర్వ్ అవరణలో గల పునర్నిర్మించిన డాగ్ స్క్వాడ్ ను, పోలీస్ హ్యాపీ హోమ్స్ నూ ఆయా విభాగాల ఆర్.ఐ ల చేతుల మీదుగా తిరిగి ప్రారంభించారు.

                        సీపీ గారు నగర పోలీసు శాఖకు చెందిన అన్ని విభాగాల భవనాలను సందర్శించిన విషయం విదితమే, అందులో భాగముగా నగర డాగ్ స్క్వాడ్ భవనాన్ని , పోలీస్ సిబ్బంది యొక్క డార్మిటరీ మరింత ఆధునికరించవలసిన అవసరం గుర్తించి , తగు నిధులు ఏర్పాటు చేసి పూర్తిగా ఆధునీకరించడం జరిగినది.

                         ఈ రోజు సీపీ గారి సమక్షంలో పోలీస్ డాగ్ స్క్వాడ్ భవనాన్ని కే.రవి కుమార్ RI(CSB) గారు , పోలీస్ హ్యాపీ హోమ్స్ ను పి.వెంకటేశం RI(QM) గారు ప్రారంభించారు. ఈ సందర్భముగా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం సీపీ గారు చూపిన చొరవకు ప్రతీ ఒక్క పోలీసు సిబ్బంది తమ హర్షం వ్యక్తం చేశారు.

                     ఈ కార్యక్రమంలో జాయింట్ సీ.పీ శ్రీ కే.ఫక్కీరప్ప కాగినెల్లి, ఐ.పీ.ఎస్., గారు, డి.సి.పి-1(ఎల్&ఓ) శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐ.పీ.ఎస్.,గారు, డి.సి.పి(క్రైమ్స్) శ్రీమతి పి.వెంకటరత్నం గారు , శ్రీ ఎం.ఆర్.కే రాజు గారు,ఎ.డి.సి.పి(అడ్మిన్) శ్రీ ఎస్.వెంకట రావు గారు, ఎ.డి.సి.పి(ఎస్.బి) ,శ్రీ బి. నారాయణ రావు గారు, ఎ.డి.సి.పి(ఎ.ఆర్) , ఎ.సి.పి దిశా గారు, ఎ.సి.పి-01(ఎ.ఆర్) గారు,ఎ.సి.పి-02(ఎ.ఆర్) గారు, ఆర్.ఐ లు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


    

                               నగర పోలీసు తరపున,

                                    విశాఖపట్నం సిటీ.