అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన పాత బస్తి దూద్ బౌలి ఇన్ ఛార్జ్ శుభాకాంక్షలు రిజిస్టార్



హైదరాబాద్‌ : పాతబస్తీ దూద్‌బౌలి ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ అనిశా వలకు చిక్కారు. బహదూర్‌పురలోని దూద్‌బౌలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ హైదరాబాద్‌ సిటీ రేంజ్‌ డీఎస్పీ కె.శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం రాత్రి వివరాలు వెల్లడించారు. దూద్‌బౌలి సబ్‌రిజిస్ట్రార్‌ శేఖర్‌ ఆరు నెలల కిందట బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న అమిర్‌ ఫరాజ్‌ ఇన్‌చార్జిగా సాగుతున్నారు. శాలిబండకు చెందిన సయ్యద్‌ షహబాజ్‌, ఆయన స్నేహితుడు షేక్‌ పర్వేజ్‌ కలిసి కస్బామీర్‌సాగర్‌ మీరాలంట్యాక్‌ సమీపంలోని 200 గజాల స్థలం కొన్నారు. అందుకు 2 సేల్‌డీడ్‌ రిజిస్ట్రేషన్లకు ఇటీవల సయ్యద్‌ షహబాజ్‌ సబ్‌రిజిస్ట్రార్‌ అమిర్‌ ఫరాజ్‌ను సంప్రదించాడు. ఒక సేల్‌డీడ్‌ రిజిస్ట్రేషన్‌ సయ్యద్‌ షబాజ్‌ తనపేరిట, మరో సేల్‌డీడ్‌ తన మిత్రుడితో కలిపి జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరారు. అందుకు రూ.2 లక్షలు ఇవ్వాలని ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ డిమాండ్‌ చేశాడు. అంగీకరించిన సయ్యద్‌ షహబాజ్‌ ఏసీబీని సంప్రదించాడు. మంగళవారం సాయంత్రం రూ.2 లక్షలు తీసుకుని దూద్‌బౌలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సయ్యద్‌ షహబాజ్‌ రాగానే తన ప్రైవేటు అసిస్టెంట్‌ గోపిసింగ్‌కు డబ్బులు ఇవ్వాలని అమిర్‌ ఫరాజ్‌ సూచించాడు. డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.