ఏపీకి రిలయ్స్, బిర్లా భారీ పెట్టుబడులు.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
నేడు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
రూ.1,700 కోట్లతో ఆదిత్య బిర్లా కార్బన్ బ్లాక్ మానుఫ్యాక్చర్ ఫెసిలిటీ
రూ.1,024 కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు
పలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభం
మొత్తం 10 కంపెనీలు..రూ.4,883 కోట్ల పెట్టుబడులు
4,046 మందికి ఉద్యోగాలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు. రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తోపాటు పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు..