గ్రూపుగా ఏర్పడి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ర్యాగింగ్.

 *విశాఖ:*


విశాఖలోని కొమ్మాది జవహర్ నవోదయలో ప్లస్ టూ విద్యార్థులు గ్రూపుగా ఏర్పడి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ర్యాగింగ్. 



వారి బట్టలు ఉతికించుకొని  వారి వద్ద నుండి రూ. 500 వసూలు, ఇవ్వని విద్యార్థులను వారిని  కర్రలుతో కొట్టి హింసించిన వైనం..


రంగంలోకి బాధితుడి తల్లిదండ్రులు, పోలీసుల జోక్యంతో 'నవోదయలో పైశాచికత్వం'

ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక తెచ్చింది.

సీనియర్ విద్యార్థుల ఆటవిక దాడిలో గాయపడిన పదో తరగతి

విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదులో భీంసేన (వార్) రంగంలోకి దిగింది.

పి.ఎం.పాలెం పోలీసులను ఆశ్రయించి నవోదయ ఆటవిక రాజ తాము

చెప్పిందే వేదంగా కర్ర పెత్తనం చెలాయించిన విద్యార్ముల అరాచకాలపై క్షేత్రస్థాయి పరిశీలన

జరిపారు. ఫిర్యాదులో వాస్తవాలను తొలుత తేలిగ్గా కొట్టిపారేసిన ప్రిన్సిపల్ సీనియర్ విద్యార్థుల

జులుం పెచ్చుమీరిన సంగతి గ్రహించారు. కొమ్మాది నవోదయలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు

గ్రౌండ్ ఫ్లోర్ ఇంటర్ ఫస్టియర్ వారికి ఫస్ట్ ఫ్లోర్ ఒక బ్లాకులో కేటాయించారు. అలాగే మరో

బ్లాకులో పదో తరగతి విద్యార్థులకు గ్రౌండ్ ఫ్లోర్ ఇంటర్ సెకండ్ ఇయర్ వారికి ఫస్ట్ ఫ్లోర్

గదులు కేటాయించారు. దీంతో సినిమార్లు జూనియర్లతో వెట్టిచాకిరీ చేయించుకోవడం

చేయకపోతే ఒళ్లు హూనమయ్యేలా చితకబాదడం రివాజుగా మారింది. ఇన్నాళ్ళుగా ప్రిన్స్ పల్

వార్డెన్లు ఉదాశీనంగా చూసీ చూడనట్టుగా వ్యవహరించడంతో సీనియర్ల పైశాచికానందం

పరాకాష్ఠకు చేరింది. లీడర్ కథనంలో వాస్తవాలను నగర పోలీస్ కమీషనర్ సీరియస్గా

తీసుకున్నారు. బుధవారం సాయంత్రం ఇంటిలిజెన్స్ పోలీసులు పీఎంపాలెం పోలీసు స్టేషన్

సందర్శించారు. అప్పటికి స్టేషన్లో ఉన్న బాధిత విద్యార్థి పవన్ తల్లిదండ్రులు నౌండ్రు

శ్రీనివాసరావు ఇతర బంధువులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను గ్రహించారు. పోలీసుల,

ప్రిన్స్బల్ సాయంతో భీం సినీ (వార్) ప్రతినిధులు దుర్గారావు, బాలకృష్ణ విద్యార్థులకు కౌన్సెలింగ్

నిర్వహించారు. 15 మంది తొమ్మిది పది తరగతుల విద్యార్థులు ర్యాగింగ్ లో తీవ్రంగా

గాయపడిన వీపులను చూసి గుర్తించారు. 11 మంది సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఈ అల్లర్లు

అరాచకాలకు కారకులుగా నిర్ధారణకు వచ్చారు. దాడికి కారకులైన 11 మంది విద్యార్థుల కెరీర్

పాడవ్వకుండా ఇంటర్ పరీక్షల వరకూ సస్పెండ్ చేసి నేరుగా పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు

తీసుంటామని ప్రిన్స్ పల్ పోలీసులు భీంసేన

సముక్షంలో తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.

అనంతరం తొమ్మిది పది తరగతుల

విద్యార్థులను ఒక బ్లాకులోకి ఇంటర్

విద్యార్థులను మరో బ్లాకులోకి మారిస్తే

పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఒక

అవగాహనకు వచ్చారు. ఒకటి రెండు

రోజులలో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి

ప్రిన్స్ పల్ ఆదేశించారు. అలాగే పూర్తి స్థాయి

వార్డెన్ పర్యవేక్షణలో రెండు బ్లాకులను

నిఘాలో ఉంచుతామని ప్రిన్స్ఫల్ హామీ

ఇచ్చారు. రాత్రి 'ఎనిమిది గంటల వరకూ

జరిపిన అధ్యయనం అనంతరం పోలీసులు

తల్లిదండ్రులు భీంసేన ప్రతినిధులు

వెనుదిరిగారు. ఇకపై ఇలాంటి ఘటనలు

పునరావృతం కాకుండా చూడాలని పోలీసులు

ప్రిన్సిపల్ కు సూచించారు.