*పోలీస్ సిబ్బందికి సూచనలు @ మిలన్-2024.*
డా. ఏ. రవిశంకర్,ఐపీఎస్,కమీ షనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఉత్తర్వులు మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐపీఎస్,జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో మిలన్-2024 కి విధులు నిర్వహించే అధికారులకు మరియు సిబ్బందికి డీ.సీ.పీ-1(ఎల్ &ఓ) వి.ఎన్.మణికంఠ చందోలు, ఐ.పీ.ఎస్, ఏయూ కాన్వికేషన్ హాల్లో బ్రీఫింగ్ నిర్వహించి పలు సూచనలు చేయడమైనది కార్యక్రమానికి వచ్చే వృద్ధులకు,మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నేహ పూర్వకంగా మెలగాలని,ట్రాఫిక్ అంతరాయం లేకుండా విధులు నిర్వర్తించాలని కోరారు సందర్శ కులుకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సుమారు 5000 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.