ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 1.30కి వీరభద్ర స్వామి ఆలయంలో పూజ చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3.30కి సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి వెళ్లి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. IRS లోని కస్టమ్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ విభాగానికి చెందిన 74, 75 బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో మాట్లాడతారు. అళాగే భూటాన్‌కి చెందిన రాయల్ సివీల్ సర్వీస్ విభాగ ఆఫీసర్ ట్రైనీస్‌తో కూడా ముచ్చటిస్తారు..