మంచు కొండల్లో కాజల్




పెళ్లి తర్వాత కాజల్ తెలుగులో బాలయ్య సరసన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దసరాకు విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అది అలా ఉంటే కాజల్ తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ తన భర్త, కొడుకుతో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 60వ సినిమాకి సత్యభామ పేరు ఖరారు చేశారు. ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తోంది. అయితే ఈరోజుల్లో 60 చిత్రాలు పూర్తి చెయ్యడం అంటే మాటలు కాదనే చెప్పోచ్చు. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.. జల్ ప్రస్తుతం ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై కాజల్ అగర్వాల్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుందని తెలుస్తోంది. ఇక కాజల్, శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2లో కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలై, కొన్నాళ్లు షూటింగ్ జరుపుకుని ఆగిపోయింది. ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లినప్పటీ నుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పూర్తికాకుండా పోయింది. ఈ సినిమా కొంత భాగం షూటింగ్‌ జరిగిన తరువాత.. సెట్లో ప్రమాదం జరగడం.. ఆ తర్వాత నటుడు వివేక్‌ మృతి, దీనికి తోడు దర్శకుడు శంకర్‌కు, లైకా ప్రొడక్షన్స్‌ మధ్య అభిప్రాయ భేదాలు రావడం ఇలా కర్ణుడి చావుకు వెయ్యి కారణాలు అన్నట్లు.. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది. ఇక ఆ తర్వాత కొన్నాళ్లకు శంకర్‌.. రామ్ చరణ్‌తో ఓ సినిమాను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇక ఆ సినిమా అలా ఉండగానే శంకర్ భారతీయుడు2 కూడా రెస్యూమ్ చేశారు.. ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్, కాజల్‌లతో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్దార్థ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, బాబీ సింహా, స‌ముద్రఖని కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీలో 15 ఏళ్ల‌కు పైగానే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆస్తులు బాగానే కూడ‌బెట్టినట్లు తెలుస్తోంది. కాజ‌ల్ కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారు. కాని కాజ‌ల్ కూడా వంద కోట్ల వరకు ఆస్తులు కూడ‌బెట్టి అందరికి షాక్ ఇచ్చారని అంటున్నారు. కాజ‌ల్ సినిమాలతో పాటు తన కెరీర్‌లో స్పెష‌ల్ సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో కూడా నటించి మెప్పించారు. ఆమె ప్ర‌స్తుతం త‌న భ‌ర్త‌ గౌతమ్‌తో క‌లిసి వ్యాపారం చేస్తున్నారు. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆచార్యలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించారు. అయితే కొన్ని రోజుల చిత్రీకరణ తర్వాత ఈ చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో ఆమె పాత్రకు స్కోప్ లేకపోవడంతో ఆమె పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ పలు ఇంటర్యూల్లో తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.