మూడో రోజుకు చేరుకున్న కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహార దీక్ష


విజయవాడ: కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. విజయవాడలోని శ్రీరామ ఫంక్షన్ హాలులో వీరి దీక్ష కొనసాగుతోంది..


ఫంక్షన్ హాలు ఖాళీ చేయాలని కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిపై ఒత్తిడి వస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షకు సమతా సైనిక్ దళ్ మద్దతు ఇస్తోంది. దీక్షపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాత్రంతా దీక్షా ప్రాంగణంలోనే పోలీసులు బస చేశారు..


ఫంక్షన్ హాలు ఖాళీ చేయించాలని యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నది పోలీసులేనని సమత సైనిక్ దళ్ ఆరోపిస్తోంది. కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ ఆరోగ్యం క్షీణిస్తోంది. మరోవైపు కోడికత్తి శ్రీను సైతం విశాఖ జైలులో మూడో రోజు దీక్ష కొనసాగిస్తున్నాడు. జగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని శ్రీను కుటుంబం డిమాండ్ చేస్తోంది. ఇవాళ కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. నిన్న దీక్ష భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. నిన్న పోలీసులకు, సమతా సైనిక్ దళ్‌కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది..