ఆర్టీసీ డ్రైవర్లు భద్రత నియమాలు పాటించాలి- ఈస్ట్ ట్రాఫిక్ సిఐ అమ్మి నాయుడు
డ్రైవర్లు విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి అని ఈస్ట్ ట్రాఫిక్ సిఐ ఎస్. అమ్మి నాయుడు కోరారు. ఆయన వాల్తేరు డిపోలో గురువారం జరిగిన రోడ్డు భద్రతా మాసో త్సవలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సులు బస్టాప్ వద్ద సక్రమంగా ఆపాలని సూచించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్.ఏ. గణేష్ రెడ్డి మాట్లాడుతూ, సిబ్బంది ఎడ్యుకేట్, ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్ మెంట్ (ఈ ఈ ఈ) ద్వారా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, సిటీ బస్సుల్లో ఫుట్ పాత్ మీద హ్యాంగింగ్ లేకుండా కండక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. డిపో మేనేజర్ కే. సుధాకర్ రావు మాట్లాడుతూ, ఈ నెల 15 న మొదలైన మాసొత్సవలు ఫిబ్రవరి 14 వరకు జరుగుతాయి అన్నారు. డ్రైవర్స్ మీద మానసిక ఒత్తిడి నివారణకు గాను వారి కుటుంబ సభ్యులుకి కౌన్సెలింగ్ వంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అన్నారు. అలాగే, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో గ్యారిజి కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.