- వ్యక్తిగతంగా చూడడం తప్పేమీ కాదు.*.
- *మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు*
- చిన్నారుల అశ్లీల చిత్రాలను మొబైల్‌లో చూసినట్టు యువకుడిపై కేసు
- చూసింది నిజమే కానీ అవి చిన్నారులవి కావన్న యువకుడు
- యువకులు మద్యానికి, ధూమపానానికి బానిసలు అయినట్టే ఇప్పటి పిల్లలు అశ్లీల చిత్రాలకు బానిలవుతున్నారన్న కోర్టు
- నిందలు మాని వారు ఆ వ్యసనం నుంచి బయటపడే మార్గాలు చూడాలని సలహా
- మొబైల్ ఫోన్‌లో చిన్నారుల అశ్లీల చిత్రాలు డౌన్‌లోడ్ చేసి చూసినందుకు నమోదైన కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని స్పష్టం చేసింది. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ అంబత్తూరుకు చెందిన యువకుడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.
- నిన్న ఈ కేసు విచారణకు రాగా.. కోర్టుకు హాజరైన యువకుడు తాను అశ్లీల సినిమాలు చూడడం నిజమేనని, కాకపోతే తాను చూసినవి పిల్లలకు సంబంధించినవి కావని కోర్టుకు తెలిపాడు. ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. వాదోపవాదాల అనంతరం ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
- అనవసరంగా నిందలు మోపవద్దు
- అశ్లీల చిత్రాలను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వ్యక్తిగతంగా చూడడంలో ఎలాంటి తప్పు లేదని, వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే నేరమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
- 1990లలోని యువత మద్యం, ధూమపానానికి ఎలా అలవాటయ్యారో, 2కే కిడ్స్ కూడా అలాగే అశ్లీల చిత్రాలకు బానిసలుగా మారారని తెలిపారు. వారిపై అనవసరంగా నిందలు మోపడం మాని ఆ అలవాటు నుంచి వారు బయటపడేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేంత పరిణితి సమాజానికి రావాలని అభిప్రాయపడ్డారు.
- ముుఖ్యంగా స్కూల్ స్థాయిలోనే వారికి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాల్సి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.