BEST PERFORMANCE AWARD-2023

BEST PERFORMANCE AWARD-2023











                        అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఆధ్వర్యంలో నిర్వహించిన *BEST PERFORMANCE AWARD-2023* కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పివిజీడి ప్రసాద్ రెడ్డి గారు , వైస్ ఛాన్సలర్, ఆంధ్రా యూనివర్సిటీ మరియు జి.శ్రీనివాసన్ గారు, ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్, ఎవిఎస్ఎం, విఎస్ఎం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.*

                            ఈ రోజు 24/01/2024 న బీచ్ రోడ్ నందు గల ఏ.యూ కన్వకేషన్ సెంటర్ లో నందు నిర్వహించిన *BEST PERFORMANCE AWARD-2023* కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు జ్యోతిప్రజ్వలన చేసి ఆరంభించారు.

                             ఈ కార్యక్రమంలో Addl.DGP, కమీషనర్ ఆఫ్ పోలీస్ & AddL జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు మాట్లాడుతూ ముఖ్య అతిథులకూ, మహిళా పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు , క్రైమ్ పోలీసులకు కోర్టు మానిటరింగ్ చేసే సిబ్బందికి , ఈ కార్యక్రమం నందు పాల్గొనటానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బెస్ట్ పెర్ఫామెన్స్ ఆఫ్ ఇయర్ అవార్డులు కార్యక్రమం ప్రవేశపెట్టడానికి ముఖ్యకారణం నిత్యం పోలీసు కంట్రోల్ రూమ్ నకు అనేక అంశాలపై ఫిర్యాదులు అందుతాయని, ముఖ్యముగా నగరములో ట్రాఫిక్, సైబర్ క్రైమ్, మహిళపై జరుగు నేరాలు అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అధికారులు, సిబ్బందికి తగు గుర్తింపు అందించడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి, కమిటీ పోలీసులు విధులలో నిర్వర్తించిన ప్రతిభ మరియు సంబంధిత అన్ని లెక్కలను పరిగణలోనికి తీసుకొని ఈ అవార్డులు అందించడం జరుగుతుంది. నగర పోలీసు శాఖ లో అందరూ ఉత్తమముగా విధులు నిర్వర్తిస్తున్నారు, మంచిని మరింత ప్రోత్సహిస్తూ, చెడును పూర్తిగా ఖండిస్తూ ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగినదని తెలియజేశారు. పై కార్యక్రమం అందరూ వినియోగించుకుంటూ విధులలో మరింత ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాక్షించారు.

                                ప్రత్యేక అతిథిగా హాజరైన శ్రీ జి.శ్రీనివాసన్ గారు, ఇండియన్ నేవీ వైస్ అడ్మిరల్, ఎవిఎస్ఎం, విఎస్ఎం మాట్లాడుతూ ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన మరియు అర్థవంతమైనదని, పోలీసులు ఇతర యూనిఫారం సర్వీస్ వారికి వారి సర్వీస్ నందు ఉత్తమము రాణించడానికి CCC (Courage, Compaction,Competence) ఉండాలని తెలిపారు, బెస్ట్ పెర్ఫామెన్స్ ఆఫ్ ఇయర్ అవార్డులు ఇవ్వడం ద్వారా నగర పోలీసు శాఖ ప్రమాణాలు మరింత ఉన్నతముగా ఉంటాయని తెలుపుతూ ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన నగర సీపీ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారికి తమ అభినందనలు తెలియజేశారు.

                             గౌరవ ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ పివిజీడి ప్రసాద్ రెడ్డి గారు , వైస్ ఛాన్సలర్, ఆంధ్రా యూనివర్సిటీ గారు మాట్లాడుతూ మారుతున్న సమాజం తో పాటూ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పోలీసులు నిత్యం శాంతి భద్రతలను అదుపులో ఉంచడం అంత సులువైన విషయం కాదని, నిత్యం ఎంతో కృషి చేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తగిన గుర్తింపు అందించడం ఎంతో అవసరం అనీ, Addl.DGP, కమీషనర్ ఆఫ్ పోలీస్ & AddL జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఎంతో ముందుచూపు తో ఈ అవార్డులు కార్యక్రమం ప్రవేశపెట్టారని, ఇది పోలీసు శాఖలో పనిచేస్తున్న అందరిలో ప్రతిభను వెలికి తీయడానికి ఉపయోగపడుతుందని, నగర పోలీస్ కమిషనర్ గారి ఈ బెస్ట్ పెర్ఫామెన్స్ ఆఫ్ ఇయర్ అవార్డులు కార్యక్రమం అన్ని ప్రభత్వ శాఖలకు వర్తింపజేస్తే ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగిన గుర్తింపు వస్తుందని ఆకాంక్షిస్తూ, ఇంతటి అధ్భుతమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సీపీ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారు ఎందరికో ప్రేరణగా నిలుస్తారని, మరోమారు సీపీ గారికి తమ అభినందనలు తెలియజేసి అవార్డులు అందుకున్న అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేసారు.

*బెస్ట్ పెర్ఫామెన్స్ ఆఫ్ ఇయర్ అవార్డులు -2023*

▪️బెస్ట్ ట్రాఫిక్  పోలీస్ స్టేషన్

ప్రథమ స్థానం -పెందుర్తి పోలీస్ స్టేషన్

శ్రీ జి.రమేశ్, సబ్   ఇన్‌స్పెక్టర్

ద్వితీయ స్థానం - గాజువాక పోలీస్ స్టేషన్ 

శ్రీ ఆర్.వి. సత్యనారాయణ రెడ్డి, ఇన్‌స్పెక్టర్

▪️BEST TRAFFIC MANAGEMENT 

ప్రథమ స్థానం- శ్రీ KNVS ప్రసాద్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ద్వారకా ట్రాఫిక్ సర్కిల్

ద్వితీయ స్థానం- కే. లక్ష్మి గారు సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టూటౌన్ ట్రాఫిక్

▪️బెస్ట్  ఇన్వెస్టిగేషన్  ఆఫీసర్ 

ప్రథమ స్థానం- శ్రీ సి హెచ్ వివేకానంద,  ACP 

ద్వితీయ స్థానం- శ్రీ టి ఇమ్మాన్యల్ రాజు , ఇన్స్పెక్టర్ 

▪️బెస్ట్  సపోర్టింగ్  ఇన్వెస్టిగేషన్  ఆఫీసర్ 

ప్రథమ స్థానం- Sri D. కిషోర్ బాబు అసిస్టెంట్

సబ్ ఇన్‌స్పెక్టర్  M V P క్రైమ్  పోలీస్ స్టేష 

ద్వితీయ స్థానం- శ్రీ టి శ్యాంసుందరరావు HC దిశ పోలీస్ స్టేషన్ 

▪️బెస్ట్ మహిళా పోలీస్

ప్రథమ స్థానం- శ్రీమతి రాజన్న భవాని

ద్వితీయ స్థానం- శ్రీమతి కందల సత్యవేణి

▪️Best in court craft and prosecution

ప్రథమ స్థానం- శ్రీమతి టి వాణి PP 

ద్వితీయ స్థానం- M  ఆదినారాయణ APP 

▪️బెస్ట్ ఇన్  కలెక్షన్  అఫ్  ఇంటలిజెన్స్ 

ప్రథమ స్థానం- శ్రీ బి వి ప్రభాకర్,  Asi 

ద్వితీయ స్థానం- శ్రీ బి ప్రసాద రావు, HC 

▪️బెస్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్  2023 

ప్రథమ స్థానం- ఎంవీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ 

K. సురేష్  కుమార్, క్రైమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ 

ద్వితీయ స్థానం- భీమునిపట్నం క్రైమ్ పోలీస్ స్టేషన్  

S.సూర్య ప్రకాశం రావు , క్రైమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ 

▪️బెస్ట్ లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ 

ప్రథమ స్థానం- PM పాలెం పోలీస్‌ స్టేషన్ 

శ్రీ వై.రామకృష్ణ   ఇన్స్పెక్టర్ 

ద్వితీయ స్థానం- కంచర పాలెం పోలీసు స్టేషన్

N.సాయి ఇన్‌స్పెక్టర్ 

▪️BEST SECURITY MANAGEMENT 

ప్రథమ స్థానం- శ్రీ పి షణ్ముఖరావు ARHC

ద్వితీయ స్థానం- శ్రీ యస్ శ్రీనివాసరావు B D Team 

▪️బెస్ట్ హోమ్  గార్డ్ 

ప్రథమ స్థానం- కుమారి రేసపు సరస్వతి, మహారాణి పేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్

ద్వితీయ స్థానం-అలమండ దామోదర రావు, హోమ్ గార్డ్ ( క్రైమ్) భీమిలి పోలీస్ స్టేషన్ 

                              డీ.సీ.పీ-1(L&O) కే. శ్రీనివాసరావు ఐ.పీ.ఎస్., గారు ముగింపు వ్యాఖ్యలు మాట్లాడుతూ కార్యక్రమం నందు పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసారు.

                         నగర పోలీసులు తరపున,

                               విశాఖపట్నం సిటీ.