పత్రిక ప్రకటన విశాఖపట్నం సిటీ తేది 20-01-2024

పత్రిక ప్రకటన

విశాఖపట్నం సిటీ

తేది 20-01-2024  



 

                           అడిషనల్ డి.జి.పి, కమీషనర్ ఆఫ్ పోలీస్ & అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ Dr.ఏ.రవి శంకర్, ఐ.పీ.ఎస్., గారి ఆదేశాలతో 08 సంవత్సరాల పాటు పోలీసు శాఖకు తన సేవలు అందించి, ఈ రోజు తేదీ 20-01-2024 న మృతి చెందిన పోలీసు జాగిలం *గ్రేసీ* కు నివాళులు అర్పించడం జరిగినది.


                           లేబ్రోడర్ రిట్రైవర్ జాతికి చెందిన గ్రేసీ 2016 నుండి 2024 వరకు సుమారు 8 సంవత్సరాల పాటు ఎక్స్ ప్లోజివ్ ట్రేడ్ కి సంబందించి సేవలను పోలీసు శాఖకు అందించింది.


                          ఈ రోజు మృతి చెందిన పోలీసు జాగిలం *గ్రేసీ* కు నగర  ఏ.సి.పి-01(ఏ.ఆర్) శ్రీ ఐ.మోహన్ కుమార్ గారు, ఏ.సి.పి-02(ఏ.ఆర్) శ్రీ ఎ.రాఘవేంద్ర రావు గారు, ఆర్.ఐ(సి.ఎస్.డబ్ల్యూ) శ్రీ .K.రవి కుమార్ గారు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొని తమ సంతాపం తెలియజేసారు.

                                             

                    నగర పోలీస్ తరపున, 

           విశాఖపట్నం సిటీ.