మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సిఐ అల్లూ స్వామి నాయుడు

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం సిఐ అల్లూ స్వామి నాయుడు: సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి



పోలీస్ వ్యవస్థకే వన్నె తెచ్చిన ఏకైక వ్యక్తి, గొప్ప మానవతా వాది, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ధీరుడు అతనే కొయ్యూరు సిఐ అల్లూ స్వామి నాయుడు. ప్రజలు, యువతీ యువకులు, మేధావులు, విద్యావంతులు ఏ సమస్యనైనా, ఏ బాధనైనా మనసులోనే దాచుకోకుండా, దిగమింగకుండా.. వ్యక్తపరిచే స్వేచ్ఛని ఇచ్చిన ఏకైక వ్యక్తి సిఐ అల్లూ స్వామి నాయుడు. కొయ్యూరు మండలం మారుమూల గ్రామాల్లోని యువత, ప్రజలు సైతం ఏ బాధనైనా ఇట్టే చెప్పేవారు. పోలీసులు, పోలీస్ వ్యవస్థ ఇలాగే ఉండాలి ధోరణిని అవలంభించిన వ్యక్తి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు పరిచిన మానవతా విలువలు కలిగిన వ్యక్తి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి.



పార్టీలకతీతంగా, వర్గాలకతీతంగా కులాలకు, మతాలకతీతంగా నడిచిన వ్యక్తి. ఇతని విలువలు తప్పు చేసిన వ్యక్తి యొక్క నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా తెలియజేయగలవు. ప్రతీ ఒక్క పోలీస్ అధికారి ఇలానే ఉంటే, సమాజంలో మార్పు ఖచ్చితంగా తీసుకురావచ్చు అనేది నా అభిప్రాయం. ఈయనను చూస్తే, కేవలం కేసులు నమోదు చేస్తేనే, శిక్షలు కఠినంగా అమలు చేస్తేనే మార్పు రాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పుడు కేసులు నమోదు చేస్తే, కొంతమంది పోలీసులకు మూడు పూటలు ముద్ద ఎలా దిగుతుందో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి, ప్రమోషన్లు, రివార్డులు, అవార్డులు.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల చేతుల మీదుగా పొందుతుంటారు. నేను చాలామంది పోలీసులను గమనించాను. ప్రజల కోసం ఇసుమంతైనా పని చేయకుండా... తప్పుడు కేసులు నమోదు చేసి, ప్రమోషన్లు, రివార్డులు, అవార్డులు అందుకున్న దాఖలాలు ఉన్నాయి. తప్పు చేయని అమాయకులను సేవ్ చేయడం కోసం జిల్లా ఎస్పీని సైతం ఒప్పించగల ఏకైక వ్యక్తి సిఐ అల్లూ స్వామి నాయుడు. ఈయన స్థానంలో వేరొక సిఐ గానీ, మిగతా ఉన్నత స్థాయి పోలీసు అధికారులు గానీ లక్షలు కోట్లు సంపాదించి ఉండేవారేమో...!? సామాన్య ప్రజలు ఏదైనా కష్టమొచ్చిన చాలా సందర్భాల్లో సిఐ అల్లూ స్వామి నాయుడుని వెంటనే ఫోన్ చేసి, తమ గోడును వినిపించేవారు. సమాజంలో మార్పు కోసం పోలీస్ వ్యవస్థ తప్పుడు కేసులు పెడితేనో, సామాన్యులను హెరాస్మెంట్ చేసి, ఎఫైర్ ఫైల్ చేస్తేనో రాదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తే, ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ లేకపోలేదు.