హైదరాబాద్ నుంచి యాదాద్రి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తట్టుకునేలా ఆరువరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి మేడిపల్లి, నాచారం, పీర్జాదిగూడ వరకు సుమారు 7KMమేర ఫ్లెఓవర్ నిర్మించాల్సి ఉంది. దీనికోసం ఆ మార్గంలో నిర్మించిన పిల్లర్లు సంవత్సరాలుగా అలంకారప్రాయంగా మిగిలాయి. గుత్తేదారుసంస్థ దివాలా ప్రక్రియలో ఉండటంతో నిర్మాణం ఎప్పటికి పూర్తి అవుతుందన్నది ప్రశ్నార్థకంగా ఉంది.