భారత చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి సత్తాచాటింది. ప్రపంచ ర్యాపిడ్ మహిళల చెస్ ఛాంపియన్షిప్లో రజతం సొంతం చేసుకుంది. గురువారం ఆఖరిదైన 11వ రౌండ్లో కేథెరీనా (రష్యా)పై హంపి విజయం సాధించింది. తెల్లపావులతో ఆడిన ఆమె గొప్ప నైపుణ్యాలు ప్రదర్శించింది. ప్రత్యర్థికి మించి ఎత్తులు వేయడంతో దూకుడుతో సాగింది. హోరాహోరీగా సాగిన టైబ్రేక్ లో హంపి పోరాట పటిమ ప్రదర్శించినా.. చివరకు పరాజయంవైపు నిలిచింది.