పోరాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ సుభాషన్న బహిరంగ లేఖ



అనేక సంవత్సరాలుగా విద్యార్థులు యువకులు ప్రజా ఉద్యమకారులు వివిధ రూపాలలో పోరాడి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక దశాబ్ద కాలం పాటు ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిన ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్త కుప్పలో విసిరేశారనీ... భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐఎంఎల్ సెక్రటరీ జై బోరన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. దీనితో నూతనంగా కాంగ్రేస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రేస్ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తుందనో, లేదా కాంగ్రేస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోనో, ఆయా సెక్షన్ల ప్రజలకు ప్రకటించిన డిక్లరేషన్లను నమ్మో వారికి ఓట్లు వేసి గెలిపించ లేదనీ.. బీఆర్ఎస్. ఓట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడ్డాయనీ జై బోరన్న, సుభాష్ చంద్రబోస్, రిషి నేతాజీ, రాజన్న జె.ఎస్.ఆర్. నేడు ఇక్కడ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి పోలాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియమకాలను ఆశించిన ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇవి లభించలేదనీ .. జనం మనిషి జే ఎస్ ఆర్ తెలిపారు. అంతకంటే ముఖ్యమైంది ప్రజా స్వామ్యాన్ని ద్వంసం చేసి ప్రజలను నిస్సహాయ స్టైలోకి నెట్టారనీ ,ఈ పదేళ్ళ కాలంలో కనీస చట్టబద్ద పాలన కాదు కదా, సాధారణ ప్రజాస్వామ్యత విలువలను కూడా తుంగలోకి తొక్కి,కేంద్రీకృత, నిరంకుశ అణిచివేత పాలనను కొనసాగించారనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల హక్కులను ప్రశ్నించిన  గొంతులను నొక్కేశారనీ ,క్రింది ఉద్యోగులపై దౌర్జన్య పూరిత విధానాలను అమలు చేస్తూ వారిపై పని భారాన్ని పెంచారనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు నూతన ప్రజాస్వామిక విప్లవ కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్  పేర్కొన్నారు. సామ్రాజ్యవాదుల, బడా కార్పోరేట్ల, భూస్వాముల, దోపిడి పాలకుల ప్రయోజనాల కోసం నీళ్ళు, నిధులను, నియమకాలను అక్రమంగా దారి మళ్ళించారనీ, ప్రవేటీకరణకు ప్రాధాన్యతను కల్పించి ఇప్పటి వరకు ఉద్యోగ నియయమకాలు చేపట్టలేదనీ, అందువలన ఫోస్టు గ్రాడ్యుయేట్ చేసిన నిరుద్యోగులే 36 లక్షలపైగా పెరిగారనీ పబ్లిష్ఠ విప్లవకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు. నీళ్ళ కోసం వెచ్చించిన నిధుల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడడమే కాక ,గోదావరి పై నిర్మించిన ప్రాజెక్టు వలన పేద, మద్య రైతాంగ వ్యవసాయ సాగు భూములకు నీళు అందించలేక పోయారనీ జె సార్ పేర్కొన్నారు. మొత్తంగా తెలంగాణ ఏర్పడిన తరువాత బడా బడా కార్పోరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు. కెసిఆర్ కుటుంబం. వారి ప్రభుత్వంలో కొనసాగుతున్న కొద్ది మంది తాబే దారులు, కలిసి నీళ్ళను, విధులను, భూములను అక్రమంగా కాజేశారనీ పీడత ప్రజల హక్కులకై నిరంతరం పోరాడుతున్న ప్రజాస్వామిక ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన దోపిడి కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మరింత ఎక్కువగా దోపిడి జరిగిందనీ, అందుకే జీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రధానంగా కేసిఆర్, కేసిఆర్ కుటుంబంపై అన్ని రంగాల్లో అన్ని సెక్షన్ ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో రగిలిన ప్రజా వ్యతిరేకత, అనంతృప్తి కోసం, ఓట్ల రూపంలో కేసిఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడారనీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషి దేవాన్ష్  బోరన్న జె కె ఆర్ గారి  జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జెఎస్ఆర్ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మూడవ సాగి అధికారం కోసం దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు జీజేసితో రహస్య రాజకీయ ఆక్రమ సంబంధాన్ని కలిగి వుండడాన్ని ప్రజా ఉద్యమాలతో చైతన్యమైన సెక్యులర్ ప్రజలు మరింతగా బీఆర్ఎస్ ను అసహించుకున్నారనీ జె ఎస్ ఆర్  అప్పడాయపడ్డారు. ఎన్నికల సమయంలో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆర్థిక, రాజకీయ ప్రలోభాలు ఎన్ని పెట్టినా ప్రజలు ఛీ కొట్టడంతో ఓటమి నుండి తప్పించుకోలేక పోయిందనీ. జెఎస్ఆర్ తెలిపారు. ప్రజా వ్యతిరేక దోపిడి అణిచివేత విధానాలను అమలు చేసినా ఏ పార్టీ అయినా ప్రజా తీర్చుకు చెత్త. కుప్పలో విసిరేస్తూ వుంటారు కాని ప్రజల ప్రత్యామ్నాయ మార్గం లేక మార్చి మార్చి అవే పార్టీలను అధికారంలోకి తీసుక రావడం అనేది విషాదకరంగా కమ్యూనిస్టు విప్లవకారుడు సిపిఐ ఎమ్ ఎల్ సెక్రటరీ కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలారా , ప్రజాస్వామిక వాదులారా... ప్రజా ఉద్యమకారులారా కాంగ్రేస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక హమీలనిచ్చి అధికారాన్ని చేపట్టిందనీ.. ప్రజాస్వామ్యాన్ని గ్యారంటినిస్తామని కూడా హమీనిచ్చిందనీ..అందుకే ప్రజల మౌళిక సమస్యలన్నింటిని పరిష్కరించమని అధికార పార్టీ కాంగ్రెస్ ను అడగండి.. అనే ప్రజలను ప్రజాస్వామిక వాదులను ప్రజాసంఘాలను కామ్రేడ్ జే ఎస్ ఆర్ కోరారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే జాబ్ క్యాలెండర్ ప్రకటించి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామిని, ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు కల్పించమనండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్ట్ విద్యార్థులకు విద్య అవకాశాలను ఉచితంగా కల్పించమనండి.. అని అభ్యుదయ వారి జెఎస్ఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఆనంతరం ప్రెస్ మీట్ లో ప్రజలే పాలకులు, మేము సేవకులం అంటూ కాంగ్రెస్ పాలన ప్రజాస్వామ్య పాలన అన్నట్లుగా మాట్లాడారు. ఏ పాలకులైనా ప్రజలను నమ్మించడానికి పడి కట్టు పదాలను వాడుతారు తప్ప ఇందులో ఎంత మాత్రం వాస్తవం వుండదనీ.. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్న పాలకులు మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు వారిని  నిస్క్రియా ప్రేక్షకులుగానే పరిమితం చేస్తారు తప్పు. ప్రజలకు రాజకీయ అధికారంతో ఏ మాత్రం భాగస్వామ్యం వుండదనే విషయాన్ని ప్రజలు గమనించాలనీ, కాంగ్రెస్ పార్టీపాలని ప్రజాస్వామిక పాలనే అయితే ప్రజల ప్రజాస్నామిక రాజకీయ నినాదాలను పరిష్కరించమని ప్రజల హక్కుల కోసం గత మూడు దశాబ్దాలుగా నూతన ప్రజాతంత్ర సమాజం కోసం పోరాడుతున్న కమ్యూనిస్టు విప్లవకారుడు సిపిఐ ఎంఎల్ సెక్రటరీ  సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ కోరారు. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలను అడగడమనేది రాజ్యంగం కల్పించిన ప్రాథమిక హక్కు ప్రజలే పాలకులు అని చెప్పుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యం గురించి అడగుదాం. ఆధికారం చేపట్టిన వెంటనే ఇంటలీజెన్స్, కౌంటర్ ఇంటలీజెన్స్, యాంటి సక్సల్స్ ఇంటలీజెన్స్, ఎస్ ఐ బి , గ్రేహౌండ్స్ లో పని చేసి నేర పూరిత అనుభవం కలిగి వున్నా అదనపు డిజీ శివధర్ రెడ్డిని రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారంటేనే రేపటి ఉద్యమాలను అణిచివేయడానికి నవేది స్పష్టమవుతుందనీ.. ప్రజాస్వామ్యత హక్కుల కోసం పోరాడుతున్న ప్రజా నేస్తం కామ్రేడ్ జే ఎస్ ఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలు అక్రమ కేసులు,ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరకుకుంటున్నారనీ... సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రెటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ తెలిపారు. అరెస్టులు నిర్బంధాలు, తప్పుడు కేసులు, ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను నిర్మించడం సాధ్యమవుతుందా? అని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజా ఉద్యమకారుడు జెఎస్ఆర్ ప్రశ్నించారు. జైళ్ళలో యేండ్ల తరబడి మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని  , ప్రజా ఉద్యమకారులపై అర్బన్ నక్సలైట్లు కలంథారి కామ్రేడ్స్ ముద్ర వేస్తూ వారిని అక్రమ కేసుల్లో ఇరికించి ఊపా చట్టం ఎస్ఐని దాడులు కొనసాగుతున్నాయనీ ఇటువంటి ఆ ప్రజాస్వామి కచేర్లను వెంటనే నిలిపివేయాలని ప్రజా ఉద్యమాలపై నిర్బంధాలను వ్యతిరేకించే ప్రజా ఉద్యమకారుడు, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న కామ్రేడ్ జె ఎస్ ఆర్ నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమకారులపై  ఇప్పటి వరకు పెట్టిన అక్షము కేసులను వెంటనే ఎత్తివేయాలని,ధర్నా చౌక్ ను ఎలాంటి ఆంక్షలు లేకుండా పునరుద్ధరించాలనీ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన వైరస్ లేఖలు జెఎస్ఆర్ విజ్ఞప్తి చేశారు. పౌర హక్కులకు, స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగని కనీసం చట్టబద్ద పాలన అయినా కొనసాగించమని తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రజాస్వాగ ఉద్యమకారులు కామ్రేడ్ జే ఎస్ ఆర్ నూతన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భూమి లేని వారికి భూమి కల్పించాలి, రుణాలు మాపి, రైతు బంధు పేరిట ప్రజా ధనాన్ని భూస్వాములకు పంచే విధానాన్ని నిలిపి వేసి పేద, మధ్య తరగతి రైతులకు, కౌలు రైతులకు రైతు బంధు వర్తింప చేయాలనీ రైతు బిడ్డ శ్రామిక ప్రజాబంధువు కామ్రేడ్. జే ఎస్ ఆర్ నూతన ప్రభుత్వాన్ని కోరారు. రైతు పండించిన పంటలకు మండీలు ఏర్పర్చి న్యాయమైన ధర కల్పించాలనీ ,భూస్వాములకు అనుకూలమైన ధరణీ పోర్టును రద్దు చేయాలనీ, రాష్ట్రంలో మిగులు భూములను, ప్రభుత్వ, బంజరు భూములను వ్యవసాయ కూలీలకు పంచాలనీ ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్. జైబోరన్న సుభాషన్న నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ప్రజల నిర్వాసిత సమస్యను పరిష్కరించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జెఎస్ఆర్ డిమాండ్ చేశారు.

ఆదివాసీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి జుల్-జంగల్- అమీన్ పై పూర్తిగా ఆదివాసులకే అధికారం కల్పించాలనీ... పైసా చట్టాన్ని, 5వ, 6వ షెడ్యూల్డ్ చట్టాలను, అప్70 చట్టాన్ని, జీవో నెంబర్ 30 అమలు చేయాలనీ,ఆదివాసీల చట్టాలకు విరుద్ధంగా ఏర్పరుస్తున్న పోలీస్ క్యాంపులను ఎత్తియాలనీ. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కమ్యూనిస్టు నాయకుడు , కామ్రేడ్ జే ఎస్ ఆర్ కోరారు. హరిత హారాన్ని రద్దు చేసి ఆదివాసులపై వున్న కేసులను ఎత్తివేయాలనీ,ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2006 ఆటవి హక్కుల చట్టం ప్రకారం లబ్ది దారులకు పట్టాలు ఇవ్వాలనీ, ప్రైవేట్ రంగ సంస్థలను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాలనీ, ఆర్టీసి ప్రవేటీ కరణను నిలిపి వేయాలనీ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీ రాసిన బహిరంగ లేఖలో ప్రజా ఉద్యమకారుడు , కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ జైబోరన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఓపెన్ కాస్టులను రద్దు చేయాలనీ, ఉత్పత్తి రంగాల్లో కాంటాక్టు కార్మికులను, ఔట్ సోర్సింగ్ కార్మికులను క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయాలనీ, డిపెండెంట్ ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని, కార్మికుల నిజా వేతనాలు పెంచాలనీ, వస్త్రా కార్మికులు, చిన్న తరహా ఉత్పత్తి దారుల హక్కులను, చిన్న తరహా మ్యానుఫాక్చరింగ్ రంగాల హక్కులను కాపాడాలనీ జెఎస్ఆర్ డిమాండ్ చేశారు.

కాజిపేట్ లో రైలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనీ ,ఇవేవో ప్రజలు కోరుకునే గొంతమ్మ గోరికలు కాదనీ చట్ట పరిధిలో ప్రభుత్వాలు. అమలు చేయాల్సిన న్యాయమైన రాజ్యంగ హక్కులు మాత్రమేనని ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ సార్ అభిప్రాయపడ్డారు. మహలక్ష్మి రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, యవ వికాసం, చేయూత ఆరు గ్యారంటీల ఉచితాలు ప్రకటించారు. వీటి వెనక వున్న ఉచితాల అంతర్యంను మనం అర్థం చేసుకోవాల్సిన ఆవసరం వుందనీ, పేదరికంలో మగ్గుతున్న వారి ఆధాయ వనరులు పెంచి పేదరికాన్ని నిర్మూలించి జీవిత భద్రతకు గ్యారంటి ఇవ్వకుండా ఇప్పటికీ 5 లక్షల్లో కోట్ట అప్పుల్లో వున్న రాష్ట్రంలో ఉచిత స్కిమ్ లను అమలు చేస్తామంటున్నారు. వీటికి ఎక్కడి నుండి నిధులు సమకూర్చుతారనేది ప్రజలు ఆలోసించాలి. ఇలాంటి పథకాలు చూడడానికి ఆకర్శణీయంగా ఉంటాయి కాని పన్నుల రూపంలో వాటి భారం ప్రత్యేక్షంగా, పరోక్షంగా ప్రజలపైన్నే  పన్నుల మీద పన్నులు వేస్తారనీ... జెఎస్ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాల నిధుల కోసం పెట్రోల్, డిజిల్ ధరలు పెంచడం, నిత్యవసర సరుకుల ధరలు పెంచడం లేదంటే సామ్రాజ్యవాదుల, దేశ, విదేశ బడా కార్పోరేట్ల వద్ద ఒప్పందాలతో లక్ష కోట్ల రూపాయలు అప్పులు తీసుక రావడం, వారి ప్రయోజనాల కోసం నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం వంటి దోపిడి అణిచివేత విధానాలు రూపొందించి ప్రజల ఆస్తులను, ఖనిజ సంపదలను తెగనమ్మేస్తారనీ.. ప్రతిక్షణం ప్రజాహితం కోరుకునే ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ 

జే ఎస్ ఆర్ నేతాజీ రాజన్న తెలిపారు. తద్వారా ప్రజా ఉద్యమాలు ముందుకొస్తాయి. కార్పోరేట్ల దోపిడి ప్రయోజనాలకు ఆటంకంగా మారిన ఉద్యమాలను అణిచివేయడానికి పూనుకుంటారనీ ,ఇక్కడే ప్రజల ప్రజాస్వామిక హక్కులను స్వేచ్ఛను పాలక ప్రభుత్వాలు చట్టాల రూపంలో కాలరాస్తున్నాయనీ, నేటి సమాజం సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల బడా భూస్వాములు పునాదులపై ఆధారపడిన ఈ రాజ్య వ్యవస్థ నిర్మితమై ఉందని, దోపిడ్ స్వభావం కలిగి ఉందని కనుక ఆదికారంలోకి పాలక పార్టీలు ఎన్ని మారిన వాటి స్వభావం మారదనీ...నూతనంగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా ఏమి అధికారంలోకి రాలేదనీ నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ స్వప్నికుడు, కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జే ఎస్ ఆర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. వేల కోట్ల డబ్బు, మద్యంతో, ప్రజలను ప్రలోభ పెట్టిన సంగతి జగమెరిగిన సత్యం. ఇంతటి అవినీతితో పార్టీలు అధికారాన్ని చేపట్టిన పార్టీ భవిష్యత్తు లో ఎంతటి అనినీతికి పాల్చడబోతుందో ప్రజలు అర్ధం చేసుకోవాలని ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి గాగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని ప్రకటించుకుందనీ.. ఇందిర రాజ్యం అంటే దోపిడీ రాజ్యం అనే విషయం, ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని ఎంత అల్లకల్లోలం సృష్టించిందనే విషయం భారత ప్రజలందరినీ తెలియంది కాదనీ బాధితుల బంధువు, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎమ్మెల్ సెక్రటరీ కామ్రేడ్. జే ఎస్ ఆర్ నేతాజీ రాజన్న తెలిపారు. అందుకే ప్రజల మౌళిక సమస్యల పరిష్కారానికి ప్రజల రాజ్యాధికారం అనేది ప్రజల ప్రత్యామ్నాయం తప్ప మరొక్కటి లేదనీ జనహితమే తనహితమై ప్రతిక్షణం ప్రజాహితం కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న పీడత ప్రజా ఉద్యమ గొంతుక, కమ్యూనిస్టు విప్లవకారుడు క జై బోరాన్నగారీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. వర్గ దోపిడికి సామాజిక వివక్షతకు సామ్రాజ్యవాదం చొరబాటుకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు నిరంతరం పోరాటం చేయాలని కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోరారు. భారతదేశంలో అనేక నేరాలు-ఘోరాలు పెరిగిపోవటానికి కారణం అవుతున్న, మనిషికి మనిషికి మధ్య మానవ సంబంధాలు నశించిపోవడానికి, అంతులేని ఆర్థిక అసమానతలు పెరిగిపోవడానికి కారణమవుతున్న భూమిని వ్యక్తిగత ఆస్తి నుండి తప్పించాలని మన దేశంలో గల యావత్ భూమిని జాతీయం చేయాలని జె ఎస్ ఆర్ నేతాజీ రాజన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థను కూడా రద్దు చేస్తూ అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని , కుల వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయుటకు కేంద్రంపై ఒత్తిడి చేస్తూ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేయాలని, దుర్మార్గమైన కుల వ్యవస్థను రద్దు చేయుటకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ముఖ్యంగా  అణగారినకులాలుగా పేర్కొనబడే దళిత బహుజన కులాలు ఐక్యంగా ఉద్యమించాలని....సామాజిక పరివర్తకుడు ,సమ సమాజ నిర్మాణానికి గత 30 సంవత్సరాలుగా ఉద్యమాల ఊపిరిగా, ప్రజాహితమే శ్వాసగా, సమసమాజ స్థాపన లక్ష్యంగా, పోరాటమే జీవితం గా జీవిస్తున్న అభ్యుదయ వాది, ఆదర్శ కమ్యూనిస్టు... కామ్రేడ్ ఈ సందర్భంగా జై బోరన్న సుభాష్ చంద్రబోస్ ఋషి నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్  కేంద్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ రేఖలో డిమాండ్ చేశారు.