ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - ఎంపీ చింతా అనురాధ


డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ నూతన సంవత్సర (2024) శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు గతంలో ఎన్నడూ చూడని సంక్షేమంతో పాటు, అభివృద్ధి జరుగుతోందని, పాదయాత్రలో జగనన్న ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ కు సరికొత్త దశ దిశా ఏర్పాటు చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలను అందించాలని, వారు ఆశించినవన్ని జరగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ చింతా అనురాధ తెలిపారు. ఎంపీ క్యాంపు కార్యాలయం, మొగళ్లమూరు