*సూళ్లూరుపేట మండలం తిరుపతి జిల్లా*
*ట్యాగ్ లైన్ :- భారతదేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలి*
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేటలో బుధవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు బాల గురువం బాబు అద్యక్షతన జై బాపూజీ, జై భీం, జై సంమిదాన్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది.
బాల గురువం బాబు మాట్లాడుతూ, "బీజేపీ పాలన దేశాన్ని తిరిగి పేదరికం వైపు నడిపిస్తోంది. పార్లమెంట్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను అవమానించిన తీరు అంగీకారానికి వీలులేని దారిలో ఉంది. అంబేద్కర్‌కు క్షమాపణలు చెప్పే ఉద్దేశం లేకుండా ప్రవర్తిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నాశనం చేస్తోంది," అని ఆరోపించారు. అంతేగాక, "తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట వంటి విషాద ఘటనలు చూస్తుంటే, ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను మరింత బహిర్గతం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పేదలు, యువత భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది? ఇటువంటి పాలనను దేశం తట్టుకోలేకపోతుంది. ప్రజలు త్వరలోనే ఎన్డీఏ ప్రభుత్వానికి సమాధానం చెబుతారు," అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మానవహారం చేపట్టి మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు, అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మా దేవదానం, జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు కలీల్, గురుమూర్తి, మురళి, జియోజక వర్గ ఇన్ఛార్జ్ వెంకటచలం, మండల అద్యక్షుడు బి.రాజారెడ్డి, పట్టణ అద్యక్షుడు శ్రీ కొలను సునీల్ రెడ్డి మరియు స్తానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.