సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ

జీఎస్టీ పోస్టర్ ను ఆవిష్కరించిన తాసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణల్లో భాగంగా జీఎస్టీ అనేక వస్తువులు పై తగ్గించి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. సోమవారం వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు వారు రూపొందించిన జీఎస్టీ పోస్టర్ ను తహసిల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల సంఘం ప్రజలలో gst తగ్గింపు సందేశాన్ని కరపత్రికల ద్వారా వాణిజ్య కూడళ్లలో ప్రచారం చేయటం జరిగింది అని తెలిపారు. వినియోగదారులు తగ్గిన gst నీ పరిగణనలోకి తీసుకొని వస్తువులు కొనుగోలు చేయాలన్నారు. అదే విధంగా పోస్టర్ పై ఉన్న qr కోడ్ స్కాన్ చేయడం ద్వారా gst కాలిక్యులేటర్ వస్తుందన్నారు. ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్, రవి నాయక్, విక్రమ్, విద్యాసాగర్ తదితర రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.